వీడియో: ఖలీ పగ తీర్చుకున్నాడిలా..! | How The Great Khali smashed Brody Steel in comeback fight | Sakshi
Sakshi News home page

వీడియో: ఖలీ పగ తీర్చుకున్నాడిలా..!

Mar 1 2016 11:59 AM | Updated on Sep 3 2017 6:46 PM

వీడియో: ఖలీ పగ తీర్చుకున్నాడిలా..!

వీడియో: ఖలీ పగ తీర్చుకున్నాడిలా..!

రెజ్లింగ్ మ్యాచులో తనపై తీవ్రంగా దాడి చేసిన ప్రత్యర్థులను చిత్తుచేసి ది గ్రేట్ ఖలీ పగ తీర్చుకున్నాడు.

న్యూఢిల్లీ: రెజ్లింగ్ మ్యాచులో తనపై తీవ్రంగా దాడి చేసిన ప్రత్యర్థులను చిత్తుచేసి ది గ్రేట్ ఖలీ పగ తీర్చుకున్నాడు. ఆదివారం డెహ్రాడూన్‌లో జరిగిన రెజ్లింగ్ మ్యాచులో ఖలీ వీరవిహారం చేశాడు. తలకు బ్యాండెడ్ కట్టుకొని రింగులోకి దిగిన ఖలీ కెనడా రెజర్లపై భారీ పంచులు కురిపించాడు. ప్రధాన ప్రత్యర్థి అయిన బ్రాడీ స్టీల్‌ను చిత్తుగా ఓడించాడు. 'ది గ్రేట్ ఖలీ షో' పేరిట ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌ వీడియో ప్రస్తుతం యూట్యూబ్‌లో హల్‌చల్ చేస్తున్నాయి.

అంతకుముందు జరిగిన మ్యాచులో కెనడియన్ రెజ్లర్ బ్రాడీ స్టీల్ ఖలీని తీవ్రంగా గాయపర్చిన సంగతి తెలిసిందే. స్టీల్, అతని సహచరులు ఒక్కసారిగా విరుచుకుపడటంతో తలకు, చేతికి గాయాలైన ఖలీ ఐసీయూలో ఉండి చికిత్స పొందాడు. గాయాల నుంచి కోలుకొని ఆదివారం రింగులోకి దిగిన ఖలీ ప్రత్యర్థులపై దాడి చేసే దృశ్యాలతోపాటు.. అంతకుముందు అతనిపై కెనడా రెజర్లు విరుచుకుపడిన దృశ్యాలు కూడా ఈ వీడియోలో చూడొచ్చు. 7.1 అడుగుల ఎత్తుతో మాంఛి బలిష్టంగా ఉండే ఖలీ అసలు పేరు దలిప్ సింగ్ రాణా. పంజాబ్ రాష్ట్ర పోలీస్ ఆఫీసర్‌ అయిన ఖలీ 2007లో హెవీ వెయిట్ ఛాంపియన్ షిప్ సాధించాడు.

 

Advertisement
 
Advertisement
Advertisement