ఢిల్లీ మహిళా కమిషన్‌పై అత్యాచారం -స్వాతి

How can Delhi sleep today when 8 month baby has been brutally raped in Capital?-says Swati malival - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ:  నెలల పసికందుపై జరిగిన దురాగతంపై  ఢిల్లీ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ స్వాతి మలివాల్  తీవ్ర ఆక్రోశం వ్యక్తం చేశారు.  ఇది ఢిల్లీ మహిళా కమిషన్‌పై జరిగిన అత్యాచారంగా అభివర్ణించారు. ఏదైనా అత్యాచార   సంఘటన జరిగిన ఆరునెలలలోపు  నేరస్తులకు శిక్ష విధించాలని పదే పదే  తాను విజ్ఞప్తి చేస్తున్నా... ఫలితం లేదన్నారు.  ఈ రోజు జాతిపిత గాంధీజీ వర్ధంతి.. ఇలాంటి  దేశాన్నా  తాను స్థాపించిందీ అని  గాంధీ ఆశ్చర‍్య పోతారన్నారు. అన్నెం పుణ్యం ఎరుగని ఎనిమిది నెలల పాపపై దారుణం..ఇదేమి  రామరాజ్యం అంటూ  ట్వీట్‌ చేశారు.  మహాత్మా గాంధీ, సుభాష్, భగత్, అష్ఫాకుల్లా లాంటి మహా యోధుల త్యాగం  వృధా అయిపోయింది... సమాజం,  వ్యవస్థ  పూర్తిగా చచ్చిపోయిందంటూ ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

దేశ రాజధాని నగరంలో పసిగుడ్డుపై  అత్యాచార ఘటన తరువాత దేశ పతాకం విశ్వంలో ఎలా ఎగురుతుందంటూ ప్రధానమంత్రి నరేంద్రమోదీనుద్దేశించి ఒక ట్వీట్‌  చేశారు.  ఈ సందర‍్భంగా ఢిల్లీ పోలీసు  వ్యవస్థపై తీవ్ర అసహనం   వ్యక్తం చేశారు. వారు వీఐపీ డ్యూటీలోమునిగితేలుతున్నారనీ, నేరస్తులకు పోలీసుల భయం  అస్సలు లేదని విమర్శించారు.

ఎనిమిది నెలల పసిపాపపై ఇంత అఘాయిత్యం జరుగుతోంటే.. ఢిల్లీ నగరం ఎలా నిద్ర పోయిందంటూ తీవ్రమైన తన మరో ట్వీట్‌లో ఆవేదనను వ్యక్తం చేశారు. ఘటన  అనంతరం    ఆసుపత్రిని సందర్శించిన ఆమె   వరుస ట్వీట్లలో  ఈ సంఘటనపై తన ఆవేదనను వ్యక్తం చేశారు.  అంతేకాదు గౌరవం కోసం పాఠశాల బస్సుపై దాడి చేసిన  సేన ఎక్కడ ఉంది అని ఆమె ప్రశ్నించారు.  ఈ దారుణం గురించి విన్న వెంటనే  తాను నిర్ఘాంత పోయాననీ,  ఆపాప ముఖం  చూడాలంటేనే భయంగా ఉందంటూ ట్వీట్‌ చేశారు. బాధిత శిశువును  స్వాతి మలీవాల్‌ నిన్న (సోమవారం)  పరామర్శించారు. శస్త్రచికిత్స తర్వాత పాప ఆరోగ్యం స్థిరంగా ఉందనీ, త్వరలోనే వైద్యులు ఆమెను డిశ్చార్చ్‌ చేస్తారని తెలిపారు.  పాప తల్లిదండ్రులకు  కౌన్సిలింగ్‌ ఇవ్వనున్నట్టు చెప్పారు. అలాగే పేదవారైన పాప  తల్లిదండ్రులకు రూ.50వేల సహాయం అందిస్తున్నట్టు ప్రకటించారు.  ఈ అంశంలో శిశువుకు తాత్కాలిక నష్టపరిహారం  అందించాల్సిందిగా కోరుతూ  కోర్టులో దరఖాస్తు చేసినట్టు  పేర్కొన్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top