ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ(ఈపీఎఫ్‌వో)లో చందాదారులుగా ఉన్న 5 కోట్ల మందికి ఇళ్ల నిర్మాణ పథకం చేపట్టేందుకు కసరత్తు సాగుతోందని కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ లోక్‌సభలో తెలిపారు.
న్యూఢిల్లీ: ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ(ఈపీఎఫ్‌వో)లో చందాదారులుగా ఉన్న 5 కోట్ల మందికి ఇళ్ల నిర్మాణ పథకం చేపట్టేందుకు కసరత్తు సాగుతోందని కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ లోక్‌సభలో తెలిపారు. ఈ మేరకు సంస్థ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్(సీబీటీ) కిందటేడాది డిసెంబర్‌లో ఒక కమిటీ ఏర్పాటు చేసిందన్నారు.