క్రాకర్స్‌ బ్యాన్‌పై రాందేవ్‌ బాబా మండిపాటు | Hindus are being targeted, says Ramdev on firecracker ban | Sakshi
Sakshi News home page

క్రాకర్స్‌ బ్యాన్‌పై రాందేవ్‌ బాబా మండిపాటు

Oct 12 2017 1:50 PM | Updated on Sep 2 2018 5:24 PM

Hindus are being targeted, says Ramdev on firecracker ban  - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ-ఎన్‌సీఆర్‌ పరధిలో దీపావళి రోజున టపాసుల కాల్చడంపై నిషేధం విధిస్తూ సుప్రీంకోర్టు వెలువరిచిన తీర్పుపై భిన్న స్పందనలు వినిపిస్తున్నాయి. ఉన్నత న్యాయస్థాన నిర్ణయాన్ని పతంజలి వ్యవస్థాపకుడు, యోగా గురు రాందేవ్‌ బాబా కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కేవలం ఓ ప్రత్యేక సమాజాన్ని మాత్రమే టార్గెట్‌ చేశారంటూ మండిపడ్డారు. ఇండియా టీవీకి ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయన, కేవలం హిందూవులను మాత్రమే టార్గెట్‌ చేశారని ఆరోపించారు. హిందూ పండుగలపై మాత్రమే నిషేధం విధించడం చాలా తప్పు అని అన్నారు. ప్రతిదాన్ని న్యాయ దిశగా తీసుకెళ్లడం సరియైనదేనా? అని ప్రశ్నించారు. తాను స్కూళ్లను, యూనివర్సిటీలను నడిపిస్తున్నానని, అక్కడ చేతితో పట్టుకుని కాల్చే బాణాసంచాలకు అనుమతి ఇచ్చినట్టు పేర్కొన్నారు.

ఎక్కువ ఆర్భాటాలకు పోయి చేసే టపాసులను తాము సపోర్టు చేయడం లేదని, ఈ నిషేధం కేవలం పెద్ద పెద్ద టపాసులపై ఉండాలన్నారు. ఇదేవిషయంపై యోగా గురు, శశి థరూర్‌పై కూడా మండిపడ్డారు. థరూర్‌ లాంటి ఒక తెలివైన మనిషి ఇలా మాట్లాడకూడదన్నారు. పటాకుల నిషేధాన్ని సపోర్టు చేస్తూ.. టపాసులు ప్రతి ఒక్కరిపై ప్రభావం చూపుతాయంటూ థరూర్‌ ట్వీట్‌ చేశారు. ఈ ట్వీట్‌పై రాందేవ్‌ బాబా స్పందించారు. ఢిల్లీ-ఎన్‌సీఆర్‌ పరిధిలో టపాసులను అమ్మకూడదని సుప్రీంకోర్టు అక్టోబర్‌ 9న తీర్పు ఇచ్చింది. నవంబర్‌ 1 వరకు ఈ నిషేధం కొనసాగుతుందని పేర్కొంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement