హిందీ కవి కేదార్‌నాథ్‌కు జ్ఞాన్‌పీఠ్ | Hindi poet Kedarnath Singh to get Jnanpith award | Sakshi
Sakshi News home page

హిందీ కవి కేదార్‌నాథ్‌కు జ్ఞాన్‌పీఠ్

Jun 21 2014 1:09 AM | Updated on Sep 2 2017 9:07 AM

ప్రతిష్టాత్మక జ్ఞాన్‌పీఠ్ పురస్కారాన్ని 2013 సంవత్సరానికి గాను ప్రముఖ హిందీ కవి కేదార్‌నాథ్ సింగ్‌కు ప్రకటించారు.

న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక జ్ఞాన్‌పీఠ్ పురస్కారాన్ని 2013 సంవత్సరానికి గాను ప్రముఖ హిందీ కవి కేదార్‌నాథ్ సింగ్‌కు ప్రకటించారు. ఉత్తరప్రదేశ్‌లోని బలియాలో జన్మించిన 80 ఏళ్ల కేదార్‌నాథ్ కవితలనే కాకుండా పలు వ్యాసాలు, కథలు కూడా రాశారు. ‘అభీ బిల్‌కుల్ అభీ’, ‘యహా సె దేఖో’ తదితర రచనలు ఆయనకు పేరు తెచ్చాయి. ఆయనను రూ.11 లక్షల నగదు, ప్రశంసాపత్రంతో సత్కరించనున్నట్లు జ్ఞాన్‌పీఠ్ అవార్డు ఎంపిక కమిటీ శుక్రవారం తెలిపింది.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement