
స్టాలిన్‌కు గట్టి సమాధానం చెప్పిన వెంకయ్య
హిందీ భాష భారతీయుల గుర్తింపు అని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. హిందీ భాషపై తాజాగా తలెత్తిన వివాదంపై ఆయన ఇలా స్పందించారు.
న్యూఢిల్లీ: హిందీ భాష భారతీయుల గుర్తింపు అని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. హిందీ భాషపై తాజాగా తలెత్తిన వివాదంపై ఆయన ఇలా స్పందించారు. 'హిందీ మన మాతృభాష. మన గుర్తింపు. దానిని చూసి గర్వించాలి' అని వెంకయ్యనాయుడు చెప్పారు.
నిత్య జీవితంలో, పనిచేసే ఆంగ్లంను అధికంగా ఉపయోగిస్తున్నామంటే అది భారత్ అభివృద్ధి సంకేతం అని చెప్పారు. మనం ఆంగ్లం నేర్చుకుంటున్నప్పుడే మన ఆలోచనలను ఆంగ్లేయుల్లాగా మార్చేశాం. ఇది దేశ ప్రయోజనాల్లో లేదు' అని చెప్పారు. ప్రధాని నరేంద్రమోదీ, ఆయన ప్రభుత్వం దేశంలోని హిందీయేతర ప్రాంతాలపై హిందీ భాషను రుద్దాలని చూస్తోందని డీఎంకే నేత స్టాలిన్ అన్న నేపథ్యంలో వెంకయ్చ ఈ విధంగా బదులిచ్చారు.