బంపర్ ఆఫర్‌: 70 కోట్ల ప్లాట్‌.. 1.75 లక్షలకే | Hema gets prime Andheri plot for just Rs 1.75 lakh | Sakshi
Sakshi News home page

బంపర్ ఆఫర్‌: 70 కోట్ల ప్లాట్‌.. 1.75 లక్షలకే

Apr 16 2016 9:06 AM | Updated on Mar 29 2019 9:31 PM

బంపర్ ఆఫర్‌: 70 కోట్ల ప్లాట్‌.. 1.75 లక్షలకే - Sakshi

బంపర్ ఆఫర్‌: 70 కోట్ల ప్లాట్‌.. 1.75 లక్షలకే

మహారాష్ట్రలో బాలీవుడ్ డ్రీమ్ గర్ల్‌ హేమామాలిని చుట్టూ వివాదం నడుస్తోంది.

ముంబై: మహారాష్ట్రలో బాలీవుడ్ డ్రీమ్ గర్ల్‌ హేమామాలిని చుట్టూ వివాదం నడుస్తోంది. అత్యంత ఖరీదైన ముంబై అంధేరిలోని రెండువేల చదరపు మీటర్ల స్థలాన్ని అతి తక్కువ ధరకు హేమామాలినికి కట్టబెట్టేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. రూ. 70 కోట్లు విలువ చేసే ఈ స్థలాన్ని ఆమె ఏర్పాటు చేయనున్న డ్యాన్స్ స్కూల్‌ కోసం కేవలం రూ. 1.75 లక్షలకే ఇవ్వడం వివాదం రేపుతున్నది.

బీజేపీ ఎంపీ అయిన హేమామాలిని పట్ల దేవేంద్ర ఫడ్నవిస్ సర్కార్‌ అనుచితమైన ఆపేక్ష కనబరుస్తోందని విపక్షాలు మండిపడుతున్నాయి. బీజేపీ నేతృత్వంలోని మహా సర్కార్‌ మాత్రం ప్రస్తుతమున్న రాష్ట్ర విధానం ప్రకారమే ఈ ధర నిర్ణయించామని, 1976 ఫిబ్రవరి 1న నిర్దేశించిన ఈ విధానం ప్రకారం స్వచ్ఛంద సంస్థలు, విద్యాసంస్థలకు 25శాతం ధరకే భూములు కేటాయించవచ్చునని చెప్తోంది.

విడ్డూరమేమిటంటే 1976నాటి మార్కెట్ ధర ప్రకారం ఈ స్థలానికి విలువ కట్టారు. అప్పటి మార్కెట్ ధర అయిన రూ. 350 చదరపు మీటరు చొప్పున రెండువేల చ.మీ. స్థలానికి రూ. 7 లక్షలు ధర నిర్ణయించి.. అందులో  25శాతానికిగాను రూ. 1.75 లక్షలు చెల్లించాల్సిందిగా ఖరారు చేశారు. నిజానికి ప్రస్తుత ప్రభుత్వ మార్కెట్‌ ధర ప్రకారం ఈ స్థలం విలువ రూ. 23కోట్లు పలుకుతుంది. ఇక ప్రైవేటు మార్కెట్‌ లో రూ. 60 కోట్ల నుంచి 70 కోట్ల వరకు ధర పలికే అవకాశముంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement