33 రోజుల్లో 228 మంది ఉన్నతాధికారుల బదిలీ | Haryana transfers 128 bureaucrats | Sakshi
Sakshi News home page

33 రోజుల్లో 228 మంది ఉన్నతాధికారుల బదిలీ

Nov 29 2014 11:49 AM | Updated on Sep 2 2017 5:21 PM

33 రోజుల్లో 228 మంది ఉన్నతాధికారుల బదిలీ

33 రోజుల్లో 228 మంది ఉన్నతాధికారుల బదిలీ

రాష్ట్రంలో 128 మంది ఉన్నతాధికారులను బదిలీ చేస్తు హర్యానా ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది.

హర్యానా: రాష్ట్రంలో 128 మంది ఉన్నతాధికారులను బదిలీ చేస్తు హర్యానా ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. బదిలీ అయిన అధికారులంతా హర్యానా సివిల్ సర్వీసెస్ (హెచ్సీఎస్) అధికారులే. ఇటీవల హర్యానా శాసనసభకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ అత్యధిక స్థానాలను కైవసం చేసుకుంది.

ఈ నేపథ్యంలో ఆ పార్టీ నాయకుడు మనోహర్ లాల్ కట్టర్ సీఎంగా అక్టోబర్ 26న పదవి బాధ్యతలు చేపట్టారు. నాటి నుంచి ఇటీవల వరకు దాదాపు 100 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేశారు. తాజాగా శనివారం 128 మంది ఉన్నతాధికారులను బదిలీ చేసే ఫైల్పై సీఎం మనోహర్ లాల్ సంతకం చేశారు. దీంతో సీఎంగా బాధ్యతలు చేపట్టిన 33 రోజుల్లో 228 మంది ఉన్నతాధికారులను బదిలీ చేయడంపై సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement