రాహుల్ కు షాకిచ్చిన బీజేపీ కార్యకర్తలు! | 'Har Har Modi' slogans raised during Rahul Gandhi's rally | Sakshi
Sakshi News home page

రాహుల్ కు షాకిచ్చిన బీజేపీ కార్యకర్తలు!

May 9 2014 5:37 PM | Updated on Mar 29 2019 9:24 PM

రాహుల్ కు షాకిచ్చిన బీజేపీ కార్యకర్తలు! - Sakshi

రాహుల్ కు షాకిచ్చిన బీజేపీ కార్యకర్తలు!

కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి చేదు అనుభవం ఎదురైంది.

దేవరియా (యూపీ): కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి చేదు అనుభవం ఎదురైంది. ఉత్తర ప్రదేశ్ లోని దియోరాలో ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ ప్రసంగిస్తున్న సమయంలో బీజేపీ ప్రధాని అభ్యర్ధి నరేంద్రమోడీకి అనుకూలంగా కొందరు నినాదాలు చేశారు.
 
రాహుల్ తన ప్రసంగంలో ఉచిత గృహా నిర్మాణాలు, వైద్య సేవలు, మహిళలకు పెన్షన్లు, తదితర హామీలు ఇస్తుండగా.. ఒక్కసారిగా 'హర్ హర్ మోడీ, ఘర్ ఘర్ మోడీ' అంటూ కొందరు నినాదాలు చేశారు. 
 
బీజేపీ కార్యకర్తలుగా భావిస్తున్న వారిని భద్రతా సిబ్బంది  అక్కడి నుంచి బలవంతంగా పంపించారు. గుజరాత్ లో కేవలం మోడీకి సన్నిహితులైన పారిశ్రామికవేత్తలే లాభపడ్డారని ఆరోపించారు.
 
మోడీకి అత్యంత సన్నిహితులైనా ఆదాని గ్రూప్ కు 43 వేల ఎకరాల భూమిని కట్టబెట్టారని, అంతేకాకుండా వారికి 26 వేల కోట్ల రూపాయల విద్యుత్ ను ఉచితంగా అందచేశారని రాహుల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement