షీలా దీక్షిత్ పై జైట్లీ సంచలన వ్యాఖ్యలు | Had Expected Sheila Dikshit To Quit Party And Take Rest: Arun Jaitley | Sakshi
Sakshi News home page

షీలా దీక్షిత్ పై జైట్లీ సంచలన వ్యాఖ్యలు

Jul 18 2016 2:00 PM | Updated on Sep 4 2017 5:16 AM

షీలా దీక్షిత్ త్వరలోనే కాంగ్రెస్ పార్టీని వీడి విశ్రాంతి తీసుకుంటారని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ జోస్యం చెప్పారు.

న్యూఢిల్లీ: షీలా దీక్షిత్ త్వరలోనే కాంగ్రెస్ పార్టీని  వీడి విశ్రాంతి తీసుకుంటారని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ  జోస్యం చెప్పారు. షీలాను ఉత్తరప్రదేశ్ సీఎం అభ్యర్థిగా ప్రకటించడంతో కాంగ్రెస్ పార్టీ బలహీన పరిస్థితి తెలుస్తోందని అన్నారు. ఢిల్లీలో మోదీ రెండేళ్ల పాలనపై జరిగిన కార్యక్రమంలో జైట్లీ ఈ వ్యాఖ్యలు చేశారు.

ఢిల్లీకి మూడు సార్లు సీఎంగా పనిచేసిన షీలాదీక్షిత్ పై తనకు గౌరవం ఉందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడున్నంత బలహీనంగా ఎప్పుడూ లేదని అన్నారు. యూపీ ఎన్నికల్లో ఆపార్టీ ఓడిపోవడం ఖాయమని దీంతో షీలా రాజకీయ విశ్రాంతి తీసుకుంటారని జైట్లీ అన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement