
న్యూఢిల్లీ: మధ్యంతర బడ్జెట్‌లో విదేశాంగ శాఖకు రూ.16వేల కోట్లను ప్రభుత్వం కేటాయించింది. గత బడ్జెట్‌తో పోలిస్తే ఇది రూ.వెయ్యి కోట్లు ఎక్కువ. గత బడ్జెట్‌లో విదేశాలకు అందించిన సాయం రూ.5,545 కోట్లు కాగా ఈసారి రూ.6,447 కోట్లకు ప్రభుత్వం పెంచింది. మాల్దీవులకు సాయం రూ.125 కోట్ల నుంచి రూ.575 కోట్లకు పెరిగింది. భూటాన్‌కు సాయం గత ఏడాది రూ.2,650 కోట్లు కాగా ఈసారి రూ.2,615 కోట్లకు తగ్గించింది. అఫ్గానిస్తాన్‌కు రూ.325 కోట్లు, బంగ్లాదేశ్‌కు రూ.175 కోట్లు, శ్రీలంకకు రూ.150 కోట్లు, మంగోలియాకు రూ.5 కోట్లు బడ్జెట్‌లో కేటాయించింది. నేపాల్‌కు రూ.700 కోట్లు కేటాయించారు.