
యువతకు కేంద్రం హెచ్చరిక
సాక్షి, న్యూఢిల్లీ: విదేశాల్లో మంచి ఉద్యోగం, అధిక జీ తం అంటూ కొందరు ఏజెంట్లు చెప్పే మాటలను నమ్మవద్దని విదేశాంగ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా ఇరాన్‌లో ఉద్యోగాల పేరిట జరుగుతున్న భారీ మోసం, కి డ్నాప్‌ల పర్వం ఇటీవల బయటపడిన విషయాన్ని గు ర్తు చేసింది. మాయ మాటలతో ఇరాన్‌కు రప్పించుకుని, ఆ తర్వాత కిడ్నాప్ చేసి వారి కుటుంబ సభ్యుల నుంచి భారీగా డబ్బులు డిమాండ్ చేస్తున్న నేరగాళ్ల ముఠాల బారిన పడవద్దని కోరింది.
ఇరాన్ ప్రభుత్వం భారతీయులకు వీసా రహిత ప్రవేశాన్ని కేవలం పర్యాటక ప్రయోజనాల కోసం మాత్రమే కల్పించిందని స్పష్టం చేసింది. అయితే, నేరగాళ్లతో సంబంధాలున్న కొందరు ఏజెంట్లు ఇదే అదనుగా ఉద్యోగాల కోసం కూడా వీసా లేకుండా వెళ్లవచ్చని నమ్మిస్తున్నారని తెలిపింది. ఇలాంటి ఆఫర్ల పట్ల అత్యంత జాగ్రత్తగా ఉండాలని కోరింది. తప్పుడు వాగ్దానాలు చేసే ఏజెంట్లు కిడ్నాపర్లతో కుమ్మక్కై ఉండే ప్రమాదం ఉందని హెచ్చరించింది.