నర్సింగ్‌ సర్టిఫికెట్లు తక్షణమే ఇవ్వండి | Sakshi
Sakshi News home page

నర్సింగ్‌ సర్టిఫికెట్లు తక్షణమే ఇవ్వండి

Published Tue, Jul 24 2018 12:41 PM

Give Nursing Certificates Instantly - Sakshi

బరంపురం ఒరిస్సా : బీఎస్‌సీ నర్సింగ్‌ విద్యార్థుల సర్టిఫికెట్లు వెంటనే ఇవ్వాలని విద్యార్థి సంఘం ప్రతినిధి జితిన్‌ సింగ్‌దేవ్‌ కోరారు.  ఈ మేరకు సోమవారం సాయంత్రం స్థానిక ఉత్కళ్‌ ఆశ్రమ రోడ్‌ ప్రాంగణంలో గల గంజాం కళాపరిషత్‌ సమావేశం హాల్లో ఎంకేసీజీ మెడికల్‌ కళాశాల బీఎస్‌సీ నర్సింగ్‌ విద్యార్థుల సంఘం, ఆలిం డియా డీఎస్‌ఓ సయుక్త ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం జరిగింది.

ఈ సందర్భంగా విద్యార్థి సంఘం ప్రతినిధి జితిన్‌ సింగ్‌దేవ్‌ మాట్లాడుతూ గత 2017–18 పాస్‌ ఔట్‌ అయిన బీఎస్‌సీ నర్సింగ్‌ విద్యార్థుల సర్టిఫికెట్లను మూడు నెలలు గడుస్తున్నా కూడా కళాశాల ప్రిన్సిపాల్‌  ఇవ్వకుండా విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

పీజీ, ఇతర  పై చదులువు చదివేందుకు జాయిన్‌ వ్యవధి గడిచిపోతున్నా కూడా తమ సర్టిఫికెట్లు ఇవ్వకుండా తమను మానసికంగా వేదనకు గురి చేస్తున్నట్లు ఆందోళన వెలిబుచ్చారు. సర్టిఫికెట్లు దొరకనందున ఉద్యోగాలకు దరఖాస్తులు పెట్టుకోలేకపోతున్నామని వాపోయారు.

 రాష్ట్రంలో ఏకైక ప్రభుత్వ నర్సింగ్‌ కళాశాల ఎంకేసీజీ మెడికల్‌ కళాశాల క్యాంపస్‌లో ఉండగా పర్లాకిమిడిలో ప్రైవేట్‌ నర్సింగ్‌ కళాశాల ఉందని ఈ రెండు నర్సింగ్‌ కళాశాలలు బరంపురం విశ్వ విద్యాలయం అధీనంలో ఉన్నాయని చెప్పారు.

అయితే  ఈ రెండు కళాశాలల 2017–18 నర్సింగ్‌ విద్యార్థులకు మే నెలలో బరంపురం విశ్వవిద్యాలయం సర్టిఫికెట్లు ఇచ్చిందని, పర్లాకిమిడిలో ప్రైవేట్‌ నర్సింగ్‌ కళాశాలలో చదివిన 2017–18 విద్యార్థులకు సర్టిఫికెట్లు  ఇవ్వగా ఎంకేసీజీలో బీఎస్‌సీ నర్సింగ్‌ కళాశాల 3 నెలలు గడుస్తున్నా కూడా ఇప్పటివరకు తమ నర్సింగ్‌ కళాశాల విద్యార్థులకు సర్టిఫికెట్లు  ఇవ్వడంలేదని చెప్పారు. 

రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన

బరంపురం సబ్‌కలెక్టర్,  కలెక్టర్, రాష్ట్ర మంత్రిని కలిసి తమ గోడు వెళ్లబుచ్చినా ఫలితం లేకపోయిందని చివరికి మీడియా ముందుకు రావలసి వచ్చిందని చెప్పారు. డీఎస్‌ఓ రాష్ట్ర కన్వీనర్‌ సోమనాథ్‌ బెహరా మాట్లాడుతూ వెంటనే కళాశాల ప్రిన్సిపాల్‌ దృష్టి సారించి నర్సరీ విద్యార్థుల సర్టిఫికెట్లు ఇవ్వాలని లేనిపక్షంలో డీఎస్‌ఓ తరఫున రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో డీఎస్‌ఓ జిల్లా అధ్యక్షుడు శివాని మిశ్రా తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement