
'సూర్యాస్తమయం తర్వాత అమ్మాయిలకు భద్రత లేదు'
యూపీలో సాయంత్రం 6 గంటల తర్వాత అమ్మాయిలకు భద్రత లేదంటూ గోవా సీఎం మనోహర్ పరిక్కర్ వ్యాఖ్యానించారు.
ఉత్తరప్రదేశ్లో మహిళల భద్రతపై గోవా ముఖ్యమంత్రి మనోహర్ పరిక్కర్ చేసిన వ్యాఖ్యలు వివాదం రేపాయి. ''గోవా వీధుల్లో అర్ధరాత్రి కూడా ఎలాంటి భయం లేకుండా అమ్మాయిలు తిరగచ్చు. కానీ ఉత్తరప్రదేశ్లో మాత్రం సాయంత్రం ఆరు గంటల తర్వాత అమ్మాయి రోడ్డుమీదకు వస్తే చాలు.. మాయమైపోతుంది'' అని ఆయన వ్యాఖ్యానించారు. అది కూడా అక్కడో ఇక్కడో కాదు.. ఏకంగా అసెంబ్లీలోనే! గోవాలో శాంతిభద్రతల పరిస్థితిపై విపక్షాలు ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో దానికి సమాధానమిస్తూ ఆయనిలా అన్నారు. పర్యాటక రంగంపై ఆసక్తి ఉన్న కొన్ని రాష్ట్రాలు గోవా పేరును చెడగొట్టి, తద్వారా పర్యాటకులను తమ రాష్ట్రానికి ఆకర్షించాలని ప్రయత్నిస్తున్నట్లు ఆయన ఆరోపించారు.
ఓ పెద్ద న్యూస్ ఛానల్ కూడా గోవా పేరును చెడగొట్టడానికి స్వార్థంతో పనిచేస్తోందని మనోహర్ పరిక్కర్ ఆరోపించారు. వాళ్లకు గోవా మీద ఏవో హక్కులు ఉన్నట్లు ప్రవర్తిస్తున్నారని, అందుకే తాను అసలా ఛానల్ చూడటమే మానేశానని అన్నారు.