గీజర్‌ నుంచి విషవాయువు.. బాలిక మృతి 

Girl Killed By Poison Gas From Electric Geyser In Mumbai - Sakshi

ముంబై : గీజర్‌ నుంచి కార్బన్‌ మోనాక్సైడ్‌ వాయువు వెలువడి బాలిక మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ముంబైలోని బొరివలి ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ నెల 5న ఉదయం స్నానం చేసేందుకు బాత్‌రూమ్‌లోకి వెళ్లిన ధృవి గోహిల్‌ (15) ఎంతసేపటికీ బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన ఆమె తల్లిదండ్రులు తలుపులు పగులగొట్టి చూశారు. అప్పటికే ధృవి అపస్మారక స్థితిలో పడి ఉంది. వేడినీటి కారణంగా ఆమె శరీరం కుడిపక్కన కాలిన గాయాలయ్యాయి. హుటాహుటిన ఆస్పత్రికి తరలించి చికిత్స ప్రారంభించారు. మృత్యువుతో పోరాడిన బాలిక ఈ నెల 10న మృతిచెందింది. కార్బన్‌ మోనాక్సైడ్‌ను అధికంగా పీల్చడం వల్లే ఈ ఘోరం జరగినట్లు వైద్యులు తెలిపారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top