దేవయానిపై క్రమశిక్షణ చర్యలు ? | Giggled disciplinary actions? | Sakshi
Sakshi News home page

దేవయానిపై క్రమశిక్షణ చర్యలు ?

Dec 21 2014 6:07 AM | Updated on Apr 4 2019 3:25 PM

దేవయానిపై క్రమశిక్షణ చర్యలు ? - Sakshi

దేవయానిపై క్రమశిక్షణ చర్యలు ?

అమెరికాలో గత ఏడాది అరెస్టయి వార్తల్లోకెక్కిన భారత దౌత్యవేత్త దేవయాని ఖోబ్రగడేపై కేంద్ర ప్రభుత్వం క్రమశిక్షణ చర్యలు తీసుకోనుంది.

  • పిల్లలకు అమెరికా పాస్‌పోర్టులు తీసుకున్నందుకు..
  • అనుమతి లేకుండా మీడియాతో మాట్లాడినందుకు
  • న్యూఢిల్లీ: అమెరికాలో గత ఏడాది అరెస్టయి వార్తల్లోకెక్కిన భారత దౌత్యవేత్త దేవయాని ఖోబ్రగడేపై కేంద్ర ప్రభుత్వం క్రమశిక్షణ చర్యలు తీసుకోనుంది. వీసా నియమాలను ఉల్లంఘించిన కేసులో అమెరికా అధికారులు ఆమెను అరెస్టు చేయడం తెలిసిందే. భారత విదేశాంగ శాఖకు చెప్పకుండానే దేవయాని తన పిల్లలకు అమెరికా పాస్‌పోర్టులు తీసుకున్నట్టు శాఖాపర విచారణలో తేలింది.

    దౌత్యాధికారుల ప్రవర్తనా నియమావళికి ఇది విరుద్ధమని విదేశాంగ శాఖ అధికారులు చెబుతున్నారు. అంతేకాక అధికారిక అనుమతి లేకుండా ఆమె మీడియాతో మాట్లాడారు. దీంతో ఆమెపై శాఖాపరమైన, క్రమశిక్షణ చర్యలు తీసుకునేందుకు కేంద్రం సిద్ధమైంది. అయితే ఏవిధమైన చర్యలు తీసుకుంటుందో తెలియరాలేదు.  అమెరికా నుంచి తిరిగిరాగానే దేవయాని విదేశాంగ శాఖ అభివృద్ధి భాగస్వామ్య విభాగంలో డెరైక్టర్ స్థాయిలో నియమితులయ్యారు.

    ప్రస్తుతం వెయిటింగ్‌లో ఉన్నారు. కాగా, తాను ఏ తప్పూ చేయలేదని దేవయాని ఇప్పటికీ బలంగా వాదిస్తున్నారు. తన పిల్లలకు పాస్‌పోర్టులు తీసుకోవడంలోను, మీడియాతో అనుమతి లేకుండా మాట్లాడడంలోనూ తాను ఏ పొరపాటు చేయలేదంటున్నారు. దౌత్యాధికారుల పిల్లలకు డిప్లొమాటిక్ పాస్‌పోర్టులు ఇస్తారని, మైనర్ పిల్లలు రెండు పాస్‌పోర్టులు తీసుకోవచ్చని సర్వీసు నియమాలు చెబుతున్నాయని ఆమె తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement