అద్వానితో నరేంద్ర మోడీ మంతనాలు | Gandhinagar or Bhopal?, Narendra Modi meets LK Advani | Sakshi
Sakshi News home page

అద్వానితో నరేంద్ర మోడీ మంతనాలు

Mar 20 2014 9:29 AM | Updated on Mar 29 2019 9:18 PM

అద్వానితో నరేంద్ర మోడీ మంతనాలు - Sakshi

అద్వానితో నరేంద్ర మోడీ మంతనాలు

బీజేపీ ప్రధాని అభ్యర్థి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ గురువారం ఉదయం ఆపార్టీ అగ్రనేత అద్వానీని కలిశారు.

న్యూఢిల్లీ : బీజేపీ ప్రధాని అభ్యర్థి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ గురువారం ఉదయం ఆపార్టీ అగ్రనేత అద్వానీని కలిశారు. అద్వానీ నివాసంలో జరిగిన ఈ భేటీలో గాంధీనగర్ సీటు వివాదంపై చర్చించినట్లు సమాచారం. కాగా భోపాల్ నుంచే బరిలోకి దిగుతానని అద్వానీ ఈ సందర్భంగా మోడీకి స్పష్టం చేసినట్లు సమాచారం. 

కాగా సమావేశపు వివరాలు మాత్రం ఇంకా వెల్లడి కాలేదు. ఇక నరేంద్ర మోడీతో ఉన్న విభేదాల కారణంగా అయిదుసార్లు పోటీ చేసిన గుజరాత్‌లోని గాంధీనగర్ స్థానానికి బదులుగా ఈసారి మధ్యప్రదేశ్‌లోని భోపాల్ నుంచి బరిలో దిగాలనుకున్న అద్వానీ ఆశలపై పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ నీళ్లు చల్లిన విషయం తెలిసిందే.

పార్టీలోని సీనియర్లకు కోరుకున్న చోట సీట్లు కేటాయిస్తున్న తరహాలో తనకు కూడా భోపాల్ స్థానాన్ని కేటాయించాలన్న ఆయన డిమాండ్‌ను నిర్ద్వంద్వంగా తిరస్కరించింది.  అద్వానీ ఈసారి కూడా గాంధీనగర్ స్థానం నుంచే తిరిగి పోటీ చేయాలని నిర్ణయించింది. ఈ నిర్ణయం అద్వానీ, మోడీల మధ్య నెలకొన్న విభేదాలను ప్రతిఫలించినట్లు అయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement