ఏపీ బాటలో ఉత్తరాఖండ్‌.. | Gairsain To Be Uttarakhand Summer Capital Says Trivendra Rawat | Sakshi
Sakshi News home page

ఉత్తరాఖండ్‌ వేసవి రాజధాని ఏదంటే

Mar 4 2020 8:00 PM | Updated on Mar 5 2020 9:11 AM

Gairsain To Be Uttarakhand Summer Capital Says Trivendra Rawat - Sakshi

గైర్సైన్‌ : ఉత్తరాఖండ్‌ వేసవి రాజధానిగా గైర్సైన్‌ను ఎంపిక చేసినట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి తివేంద్ర సింగ్‌ రావత్‌ ప్రకటించారు.  ఈ  మేరకు ముఖ్యమంత్రి ఈ విషయాన్ని అసెంబ్లీలో  పేర్కొన్నారు. గైర్సైను శాశ్వత రాజధానిగా చేయాలని కొంత కాలంగా పర్వత ప్రాంత ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు. అయితే ఉత్తరాఖండ్‌ జ్యుడీషియల్‌ క్యాపిటల్‌గా డెహ్రాడూన్‌, జ్యుడీసియల్‌ రాజధానిగా నైనిటాల్  కొనసాగనున్నాయి. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం  గైర్సైన్‌లో కొత్త అసెంబ్లీ భవనాన్ని నిర్మించారు. అధికారుల నివాస భవనాలు సహా పలు భవనాలు నిర్మాణ దశలో ఉన్నాయి. గైర్సైన్‌ ప్రాంత సమీపంలో విమానాశ్రయ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కూడా మూడు రాజధానులను ఏర్పాటు చేయనున్న సంగతి తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement