బీజేపీ గూటికి అల్పేష్‌ ఠాకూర్‌ | Former Gujarat Congress MLA Alpesh Thakor Aide Dhaval Sinh Zala Join BJP | Sakshi
Sakshi News home page

బీజేపీ గూటికి అల్పేష్‌ ఠాకూర్‌

Jul 18 2019 6:10 PM | Updated on Jul 18 2019 6:10 PM

Former Gujarat Congress MLA Alpesh Thakor Aide Dhaval Sinh Zala Join BJP - Sakshi

బీజేపీలో చేరిన అల్పేష్‌ ఠాకూర్‌

అహ్మదాబాద్‌ : గుజరాత్‌ నుంచి రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధులకు ఓటు వేసిన అనంతరం కాం‍గ్రెస్‌ ఎమ్మెల్యేగా వైదొలగిన అల్పేష్‌ ఠాకూర్‌ తన సహచరుడు, ఎమ్మెల్యే ధావల్‌ సింగ్‌ ఝలాతో కలిసి గురువారం కాషాయ కండువా కప్పుకున్నారు. గుజరాత్‌ బీజేపీ చీఫ్‌ జితూ వాఘానీ సమక్షంలో ఇరువురు నేతలు బీజేపీలో చేరారు.

కాగా అల్పేష్‌ ఠాకూర్‌ నేతృత్వంలోని గుజరాత్‌ క్షత్రియ ఠాకూర్‌ సేన (జీకేటీఎస్‌) ఠాకూర్‌ బీజేపీ గూటికి చేరతారని ఇప్పటికే వెల్లడించింది. లోక్‌సభ ఎన్నికలకు ముందే కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసిన అల్పేష్‌, ఝలా ఆ పార్టీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్‌ పార్టీ తమను అవమానించిందని, తమకు ఏమాత్రం ప్రాధాన్యత ఇవ్వలేదని ఆరోపించారు. కాగా గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికలకు ముందు డిసెంబర్‌ 2017లో అల్పేష్‌ ఠాకూర్‌ కాంగ్రెస్‌లో చేరి రధన్‌పూర్‌ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందగా, ఝలా అరవల్లి జిల్లా బయద్‌ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement