విహారయాత్రకు వచ్చిన పశ్చిమ బెంగాల్‌వాసులు ప్రయాణిస్తున్న బస్సు శనివారం అర్ధరాత్రి తమిళనాడులో ప్రమాదానికి గురైంది.
తమిళనాడులో టూరిస్ట్ బస్సులో చెలరేగిన మంటలు
మృతులు బెంగాల్‌వాసులు
సాక్షి, చెన్నై: విహారయాత్రకు వచ్చిన పశ్చిమ బెంగాల్‌వాసులు ప్రయాణిస్తున్న బస్సు శనివారం అర్ధరాత్రి తమిళనాడులో ప్రమాదానికి గురైంది. రామనాథపురం సమీపంలో బస్సులో మంటలు చెలరేగడంతో ఐదుగురు సజీవ దహనం అయ్యారు. మరో ఎనిమిది మంది గాయపడ్డారు. పశ్చిమ బెంగాల్‌లోని బర్గూర్, ఉక్కులి, మిడ్నాపూర్ ప్రాంతాలకు చెందిన 70 మంది ఆగస్టు 22న బస్సులో విహారయాత్రకు బయలు దేరారు. ఈ బృందం శనివారం రామనాథ స్వామి దర్శనానంతరం కన్యాకుమారికి బయలుదేరింది.
అర్ధరాత్రి 12 గంటల సమయంలో తిరుప్పులాని వద్ద బస్సులో మంటలు చెలరేగాయి. ఇంజిన్‌లో చెలరేగిన మంటలతో బస్సును నిలిపివేసిన డ్రైవర్ ప్రయాణికులను అప్రమత్తం చేశాడు. గాఢ నిద్రలో ఉన్న వాళ్లు మేల్కొని బయటకు పరుగులు తీశారు. బస్సులో వంట నిమిత్తం ఉంచిన సిలిండర్ పేలడంతో మంటలు మరింత వ్యాపించాయి. 50 మందికి పైగా బస్సు నుంచి బయట పడగా.. మిగిలిన వారు మంటల్లో చిక్కారు.
రోడ్డు ప్రమాదంలో 10 మంది భక్తుల మృతి
జోధ్‌పూర్: రాజస్థాన్‌లో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో పది మంది భక్తులు మృత్యువాతపడ్డారు. మరో 34 మంది గాయపడ్డారు. ఉదయ్‌పూర్ జిల్లాకు చెందిన భక్తులు ప్రయాణిస్తున్న బస్సు పాలీ జిల్లా మనీడా గ్రామం వద్ద ఎదురుగా వస్తున్న ట్రక్కును ఢీకొంది.