
హైదరాబాద్ : కొచ్చిన్ వెళ్లాల్సిన గో ఎయిర్‌లైన్స్ విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో ఐదు గంటలు ఆలస్యంగా బయలుదేరింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. బుధవారం ఉదయం 11.40 గంటలకు శంషాబాద్ విమానాశ్రయం నుంచి కొచ్చిన్ వెళ్లాల్సిన విమానం సాయంత్రం 4.56 గంటలకు బయలుదేరింది. ఇందులో మొత్తం 150 మంది ప్రయాణికులు ఉన్నారు. ఐదు గంటల పాటు విమానాశ్రయంలోనే వేచి ఉండాల్సి రావడంతో ప్రయాణికులు ఎయిర్‌లైన్స్ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు.