ఢిల్లీలో అగ్ని ప్రమాదం, ఐదుగురి మృతి | Fire Accident in Jhilmil Industrial Area, 5 Dead | Sakshi
Sakshi News home page

ఢిల్లీలో అగ్ని ప్రమాదం, ఐదుగురి మృతి

Jul 13 2019 2:47 PM | Updated on Jul 13 2019 2:53 PM

Fire Accident in Jhilmil Industrial Area, 5 Dead - Sakshi

సాక్షి, ఢిల్లీ : జిల్‌మిల్‌ పారిశ్రామికవాడలోని ఓ రబ్బరు ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఐదుగురు చనిపోయారు. నాలుగు అంతస్థులలో ఉన్న ఈ ఫ్యాక్టరీలోని మంటలార్పడానికి దాదాపు 26 ఫైరింజన్లతో  అధికారులు ప్రయత్నిస్తున్నారు. ప్లాస్టిక్‌, రబ్బరు సానిటరీ వస్తువులను తయారు చేసే ఈ కంపెనీలో మంటలకు గల కారణాలు ఇంకా గుర్తించలేదు.  జిల్‌మిల్‌ పారిశ్రామిక ప్రాంతమైనా చుట్టుపక్కల నివాస భవనాలు చాలా ఉన్నాయి.  వీధులు చాలా ఇరుకుగా, సరైన ప్రణాళిక లేకుండా నిర్మించారని స్థాని‍కులు చెప్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement