దేశంలో ఆర్థిక ఎమర్జెన్సీ: మమతా బెనర్జీ | financial emergency has emerged in country, says mamata banarjee | Sakshi
Sakshi News home page

దేశంలో ఆర్థిక ఎమర్జెన్సీ: మమతా బెనర్జీ

Nov 16 2016 3:09 PM | Updated on Sep 27 2018 9:11 PM

దేశంలో ఆర్థిక ఎమర్జెన్సీ: మమతా బెనర్జీ - Sakshi

దేశంలో ఆర్థిక ఎమర్జెన్సీ: మమతా బెనర్జీ

దేశంలో ఆర్థిక అత్యవసర పరిస్థితి వచ్చిందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మండిపడ్డారు.

దేశంలో ఆర్థిక అత్యవసర పరిస్థితి వచ్చిందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మండిపడ్డారు. శివసేన, అకాలీదళ్, ఆమ్ ఆద్మీ పార్టీ, నేషనల్ కాన్ఫరెన్స్ నేతలతో కలిసి ఆమె రాష్ట్రపతి భవన్ వరకు నిరసన ప్రదర్శన నిర్వహించారు. పెద్దనోట్ల రద్దుపై ఆమె తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సామాన్య ప్రజలను ఈ సంక్షోభం నుంచి గట్టెక్కించాలని.. పేద ప్రజలు ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. ఈ విషయంలో రాష్ట్రపతి జోక్యం చేసుకోవాలని కోరామన్నారు. రాష్ట్రపతి కూడా ఆర్థికమంత్రిగా పనిచేసినవారేనని, అందువల్ల ఆయనకు దేశ పరిస్థితి మిగిలిన అందరికంటే బాగా తెలుస్తుందని చెప్పారు. ఈ విషయంలో ప్రభుత్వంతో మాట్లాడి.. దేశంలో సాధారణ పరిస్థితి తిరిగి వచ్చేలా చూడాల్సిందిగా చెప్పాలని కోరామని ఆమె తెలిపారు. 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement