ఆస్పత్రి పాలయిన అరుణ్ జైట్లీ | Finance Minister Arun Jaitley hospitalised | Sakshi
Sakshi News home page

ఆస్పత్రి పాలయిన అరుణ్ జైట్లీ

Sep 2 2014 11:04 AM | Updated on Sep 2 2017 12:46 PM

ఆస్పత్రి పాలయిన అరుణ్ జైట్లీ

ఆస్పత్రి పాలయిన అరుణ్ జైట్లీ

కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ఆస్పత్రి పాలయ్యారు. ఆయనను దేశ రాజధాని నగరంలోని మాక్స్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో చేర్చారు.

కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ఆస్పత్రి పాలయ్యారు. ఆయనను దేశ రాజధాని నగరంలోని మాక్స్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో చేర్చారు. ఈ ఆస్పత్రి న్యూఢిల్లీలోని సాకేత్ ప్రాంతంలో ఉంది.  సోమవారం సాయంత్రమే జైట్లీని ఆస్పత్రిలో చేర్చారు. అక్కడ ఆయనకు ఓ చిన్నపాటి శస్త్రచికిత్స చేయనున్నట్లు తెలిసింది. అయితే  అది ఏ శస్త్రచికిత్సో, ఎంతకాలం జైట్లీ విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుందో మాత్రం ఇంకా తెలియరాలేదు.

బడ్జెట్ సమర్పించే సమయంలో కూడా అరుణ్ జైట్లీ తీవ్రమైన వెన్నునొప్పితో బాధపడటంతో భారతదేశ చరిత్రలోనే తొలిసారిగా కుర్చీలో కూర్చుని ఆయన బడ్జెట్ను సమర్పించారు. అప్పటినుంచి కూడా ఆయన తరచు చిన్నచిన్న ఇబ్బందులకు గురవుతున్నట్లు తెలిసింది. అందుకే ఆస్పత్రిలో చేర్చారని సమాచారం.

Advertisement
 
Advertisement
Advertisement