ఎంపీ మండుతుంటే గుజరాత్‌పై నీళ్లు... | farmers movement spreading to other states from maharashtra | Sakshi
Sakshi News home page

ఎంపీ మండుతుంటే గుజరాత్‌పై నీళ్లు...

Jun 8 2017 2:21 PM | Updated on Oct 8 2018 5:45 PM

ఎంపీ మండుతుంటే గుజరాత్‌పై నీళ్లు... - Sakshi

ఎంపీ మండుతుంటే గుజరాత్‌పై నీళ్లు...

మహారాష్ట్రలో ప్రారంభమైన రైతుల ఉద్యమం మధ్యప్రదేశ్‌లో దావాలనంగా మారి రాజస్థాన్‌ వైపు దూసుకుపోతోంది.

న్యూఢిల్లీ: మహారాష్ట్రలో ప్రారంభమైన రైతుల ఉద్యమం మధ్యప్రదేశ్‌లో దావాలనంగా మారి రాజస్థాన్‌ వైపు దూసుకుపోతోంది. ఈ ఉద్యమం ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న గుజరాత్‌కు ఎక్కడ తాకతుందో అన్న భయంతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వాన కేంద్ర కేబినెట్‌ బుధవారం నాడు అత్యవసరంగా సమావేశమై పరిస్థితిని సమీక్షించింది. సీనియర్‌  కేంద్ర మంత్రులు పరుశోత్తమ్‌ రూపాల, మానుసుక్‌ మాండవీయలను అత్యవసరంగా గుజరాత్‌ వెళ్లి అక్కడే మకాం వేయాల్సిందిగా కేంద్రం ఆదేశించింది.

గుజరాత్‌లో గిట్టుబాటు ధరల కోసం రైతులు రోడ్డు ఎక్కకుండా రైతు సంఘాల నాయకులతో ముందస్తుగానే చర్చలు జరపాలని, రాష్ట్ర ప్రభుత్వం సమన్వయంతో అవసరమైన చర్యలు తీసుకోవాలని ఈ ఇద్దరి మంత్రులకు ఆదేశించినట్లు పార్టీ విశ్వసనీయ వర్గాల ద్వారా తెల్సింది.  రూపాల కేంద్ర వ్యవసాయం, రైతుల సంక్షేమ శాఖ సహాయ మంత్రికాగా, మాండవీయ రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ సహాయ మంత్రిగా పనిచేస్తున్నారు. గుజరాత్‌లోని బీజేపీ ఎంపీలను, ఎమ్మెల్యేలను తమ నియోజక వర్గాల్లోనే అందుబాటులో ఉండాలని పార్టీ నుంచి ఆదేశాలు వెళ్లాయి. పార్టీ అధ్యక్షుడు అమిత్‌ షా కూడా వచ్చే వారం తన పర్యటనల షెడ్యూల్‌ను మార్చుకున్నారు. గుజరాత్‌కు అందుబాటులో ఉండాలని నిర్ణయించుకున్నారు.

రిజర్వేషన్ల కోసం గుజరాత్‌లో పాటేదార్‌ లేదా పటేళ్లు ప్రారంభించిన ఉద్యమం ప్రస్తుతానికి చల్లారినప్పటికీ మళ్లీ రగుల కూడా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కూడా పార్టీ అధిష్టాం రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర పార్టీ శాఖకు తగిన ఆదేశాలను జారీ చేసింది. మహారాష్ట్ర నుంచి మెల్లగా మధ్యప్రదేశ్‌కు పాకిన రైతుల ఉద్యమాన్ని సకాలంలో పరిష్కరించకుండా తాత్సారం చేసిన ప్రభుత్వం ఇప్పుడిప్పుడే రాజకుంటున్న రాజాస్థాన్‌ రాష్ట్రాన్ని కూడా కాదని ఎన్నికలు జరుగనున్న గుజరాత్‌పై దష్టి పెట్టడాన్ని రాజకీయ విశ్లేషకులు విమర్శిస్తున్నారు. ‘మై కిసాన్‌ కా పుత్ర్‌ హు’ అంటూ ప్రతిచోట, ప్రతి సందర్భంలో చెప్పుకునే మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ రైతుల ఆందోళన గురించి ప్రశ్నిస్తే రైతులు ఆందోళనే చేయడం లేదని, ప్రతిపక్షాల కుట్రంటూ బుకాయిస్తూ వచ్చారు. రైతులు పాలను, వ్యవసాయ ఉత్పత్తులను రోడ్లపై పారబోసి నిరసనను వ్యక్తం చేయడంతో వాటి ధరలు మార్కెట్లో మండిపోయాయి. అప్పుడుగానీ రాష్ట్ర ప్రభుత్వానికి సెగ తగలలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement