వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా విడాకులు

Family Court Grants Digital Divorce To Couple Amid Coronavirus Fears - Sakshi

అలా విడిపోయారు

సాక్షి, న్యూఢిల్లీ : కరోనా మహమ్మారికి ముందు విడాకుల పిటిషన్‌ దాఖలు చేసేందుకు జంటలు అడ్వకేట్ల చుట్టూ తిరగడంతో పాటు విడాకులు మంజూరయ్యే వరకూ నానా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఉండేది. కరోనా మహమ్మారి విజృంభణతో ఢిల్లీలోని ఓ ఫ్యామిలీ కోర్టు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఓ జంటకు విడాకులు మంజూరు చేసింది. 2017 మేలో వివాహమైన జంట విభేదాలు తలెత్తడంతో ఏడాదికి పైగా విడివిడిగా ఉంటూ విడాకుల కోసం కోర్టును ఆశ్రయించారు.

ఏడాదికి పైగా వేర్వేరుగా ఉంటున్న జంటలు పరస్పర అంగీకారంతో విడాకులకు దరఖాస్తు చేయవచ్చని సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన ఉత్తర్వుల ఆధారంగా రోహిణీ కుటుంబ న్యాయస్ధానం ఈ తీర్పును వెలువరించింది. హిందూ వివాహ చట్టం, 1955 సెక్షన్‌ 13 బీ (2) కింద 2019లో విడాకుల పిటిషన్‌ దాఖలు చేసిన ఈ జంటకు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా విచారణ చేపట్టిన కోర్టు వీరికి విడాకులు మంజూరు చేసింది. తమ వైవాహిక బంధం పునరుద్ధరణకు కోర్టు కొద్దినెలలు సమయం ఇచ్చినా వారు తిరిగి విడాకులకు దరఖాస్తు చేయడంతో వారికి విడాకులు మంజూరయ్యాయి. 

చదవండి : కరోనా ఆస్పత్రిగా మారిన స్టార్‌ హోటల్‌

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top