కృష్ణ తీరథ్కు బీజేపీ తీర్థం? | ex upa minister krishna tirath to join bjp soon | Sakshi
Sakshi News home page

కృష్ణ తీరథ్కు బీజేపీ తీర్థం?

Jan 19 2015 3:17 PM | Updated on Sep 2 2017 7:55 PM

కృష్ణ తీరథ్కు బీజేపీ తీర్థం?

కృష్ణ తీరథ్కు బీజేపీ తీర్థం?

కేంద్ర మాజీ మంత్రి కృష్ణా తీరథ్ బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారు.

కేంద్ర మాజీ మంత్రి కృష్ణ తీరథ్ బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారు. బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం ప్రారంభం కావడానికి కొద్ది సేపటి ముందు ఆమె పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్ షాను ఆయన నివాసంలో కలిశారు. ఒకటి రెండు రోజుల్లోనే ఆమె బీజేపీలో చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో ఢిల్లీ యూనివర్సిటీలో ఏబీవీపీని ఓడించి మరీ విద్యార్థి నాయకురాలిగా రాజకీయ జీవితం ప్రారంభించిన ఆమె.. ఇప్పుడు బీజేపీ వైపు మొగ్గు చూపడం గమనార్హం. అయితే.. ఆమె బీజేపీలో ఏపాత్ర పోషిస్తారన్న విషయం మాత్రం ఇంకా ఖరారు కావాల్సి ఉంది.

ఇక.. తమ పార్టీ నుంచి ఓ అగ్ర నాయకురాలు బీజేపీలోకి వెళ్తున్న విషయం తెలియని కాంగ్రెస్ ప్రచార కమిటీ నాయకుడు అజయ్ మాకెన్.. తమను చూసి బీజేపీ భయపడుతోందని విమర్శించారు. తీరాచూస్తే.. అది బూమెరాంగ్ అయ్యింది. ఢిల్లీలో గత కొద్ది రోజులుగా కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వలసలు పెరుగుతున్నాయి. ఇలా వెళ్తున్న నాయకుల్లో కృష్ణ తీరథ్ నాలుగో వారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement