వ‌డ‌గ‌ళ్ల వాన‌.. అయితేంటి మందు ముఖ్యం | Even Heavy Rain, Hailstones Could Not Stop Liquor Lovers | Sakshi
Sakshi News home page

వ‌ర్షంలోనూ వైన్‌ షాపు ముందు బారులు

May 6 2020 11:30 AM | Updated on May 6 2020 12:50 PM

Even Heavy Rain, Hailstones Could Not Stop Liquor Lovers - Sakshi

డెహ్ర‌డూన్ : లాక్‌డౌన్‌ను మే 17వర‌కు పొడిగించిన నేప‌థ్యంలో కంటైన్‌మెంట్ జోన్లు మిన‌హా మిగ‌తా ప్రాంతాల్లో మ‌ద్యం అమ్మ‌కాల‌కు కేంద్రం అనుమ‌తివ్వ‌డంతో చాలా రాష్ట్రాల్లో లిక్క‌ర్ షాపులు పునః ప్రారంభ‌మ‌య్యాయి. దీంతో వైన్‌ షాపుల మందుబాబులు క్యూ క‌ట్టారు. దాదాపు 40 రోజుల త‌ర్వాత మ‌ద్యం విక్ర‌యాలు జ‌ర‌గ‌డంతో వారి ఆనందానికి అవ‌ధుల్లేవు. ఎండ‌, వాన‌కు భ‌రిస్తూ క్యూలైన్ల‌లో వేచి ఉన్నారు.  (మందుబాబులకు షాక్‌.. ఒక్కొక్కరికి రెండు బాటిళ్లు మాత్రమే)

తాజాగా ఉత్త‌రాఖండ్‌లోని నైనిటాల్‌లో భారీ వ‌డ‌గ‌ళ్ల వ‌ర్షం ప‌డుతున్నా లెక్క‌చేయ‌కుండా, భౌతిక దూరాన్ని పాటిస్తూ కిలోమీట‌ర్ల మేర  జ‌నం మ‌ద్యం షాపు ముందు క్యూ క‌ట్టారు. దీనికి సంబంధించిన వీడియోను ఓ వ్య‌క్తి షేర్ చేస్తూ.. వీళ్లు నిజంగానే యోధులు. ఎంతో ఓపిక‌గా కిలోమీట‌ర్ల మేర నిల్చున్నారు అంటూ ట్వీట్ చేశారు. ఇది అచ్చం అమితాబ్ బ‌చ్చ‌న్ న‌టించిన ఓ సినిమా స‌న్నివేశంలా ఉంది. అందులో తండ్రి చ‌నిపోతే ఆయ‌న్ను చూడ‌టానికి వ‌ర్షం ప‌డుతున్నా లెక్క‌చేయ‌కుండా ఊరంతా క‌దిలింది అంటూ ఓ క్యాప్ష‌న్‌ను జోడించారు. ఈ వీడియా సోష‌ల్ మీడియాలో తెగ చ‌క్క‌ర్లు కొడుతుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement