ఈపీఎఫ్‌వోలో జనన ధ్రువీకరణకు ఆధార్‌

Epfo Accept Aadhaar Card For Online Validating Dob - Sakshi

న్యూఢిల్లీ: ఎంప్లాయీస్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ ఆర్గనైజేషన్‌(ఈపీఎఫ్‌వో) ఖాతాదారులు తమ జనన తేదీ ధ్రువీకరణకు ఆధార్‌ కార్డును రుజువుగా చూపవచ్చని కేంద్రం తెలిపింది. ఈ మేరకు క్షేత్ర స్థాయి అధికారులకు ఈపీఎఫ్‌వో ఆదేశాలిచ్చిందని పేర్కొంది. ఖాతాదారులు తమ ఆధార్‌తో ఆన్‌లైన్‌లో కేవైసీ సమర్పించవచ్చని వివరించింది. రికార్డుల్లో ఉన్న పుట్టిన రోజుకు, ఆధార్‌లో జనన తేదీకి మధ్య మూడేళ్లలోపు ఉంటే అధికారులు ఆధార్‌నే పరిగణనలోకి తీసుకుంటారని పేర్కొంది. లాక్‌డౌన్‌ కారణంగా ఆర్థికంగా ఇబ్బందిపడే ఖాతాదారులు తమ మూడు నెలల బేసిక్‌ వేతనం, డీఏ ఉపసంహరించుకునేలా కేంద్రం వెసులుబాటు కల్పించిన విషయం తెలిసిందే. కేవైసీ ద్వారా పూర్తి వివరాలు అందజేసిన వారికే ఈ సౌకర్యం వర్తించనుంది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top