సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి, విఖ్యాత న్యాయనిపుణుడు వీఆర్ కృష్ణ అయ్యర్(100) గురువారం కన్నుమూశారు.
కోచి: సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి, విఖ్యాత న్యాయనిపుణుడు వీఆర్ కృష్ణ అయ్యర్(100) కన్నుమూశారు. గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన్ను చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేర్పించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం ఆయన తుదిశ్వాస విడిచినట్టు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. 1952లో ఎమ్మెల్యేగా ఎన్నికైన కృష్ణ అయ్యర్ 1957-59 వరకూ మంత్రిగా పనిచేశారు.
అంతేకాక న్యాయశాఖ మంత్రిగా కూడా ఆయన అనేక సంస్కరణలు తీసుకొచ్చారు. 1973లో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా అయ్యర్ ప్రమాణస్వీకారం చేశారు. రాజకీయ నాయకుడిగా సేవలందించిన ఆయన సుప్రీంకోర్టులో న్యాయమూర్తిగా నియమితులైనారు. 1999లో కేంద్ర ప్రభుత్వం ఆయన్ను పద్మవిభూషణ్తో గౌరవించింది.