ఆప్ అభ్యర్థి నివాసంలో మద్యం సీసాలు | Election Commission officials raids AAP candidate Naresh Balyan's residence | Sakshi
Sakshi News home page

ఆప్ అభ్యర్థి నివాసంలో మద్యం సీసాలు

Jan 31 2015 10:40 AM | Updated on Jul 18 2019 2:26 PM

ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి నరేష్ బల్యాన్ నివాసంపై ఎన్నికల కమిషన్ అధికారులు శనివారం దాడులు నిర్వహించారు. ఢిల్లీలోని ...

న్యూఢిల్లీ : ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి నరేష్ బల్యాన్ నివాసంపై ఎన్నికల కమిషన్ అధికారులు శనివారం దాడులు నిర్వహించారు. ఢిల్లీలోని ఆయన ఇంట్లో సోదాలు చేపట్టిన అధికారులు పెద్ద ఎత్తున మద్యం బాటిల్స్ను స్వాధీనం చేసుకున్నారు. సుమారు 5వేల మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్న అధికారులు నరేష్ బల్యాన్పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా మద్యం నిల్వ చేసిందుకు ఈ మేరకు చర్యలు తీసుకున్నారు.  నరేష్ బల్యాన్ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్తమ్ నగర్ నుంచి పోటీ చేస్తున్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరి 7న జరగనున్నాయి.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement