తమిళనాడు, కేరళ, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి సహా తెలంగాణ రాష్ట్రంలో నేటితో ఎన్నికల ప్రచారం ముగిసింది.
తమిళనాడు/కేరళ/పుదుచ్చేరి/ఖమ్మం: తమిళనాడు, కేరళ, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి సహా తెలంగాణ రాష్ట్రంలో నేటితో ఎన్నికల ప్రచారం ముగిసింది. తమిళనాడులో 234, కేరళలో 140, పుదుచ్చేరిలో 30 స్థానాలకు ఈ నెల 16న అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి.
అదేరోజున తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలో ఒక స్థానమైన పాలేరులో ఉప ఎన్నిక జరుగనుంది. ఎల్లుండి ఉదయం 7 గంటల నుంచి ఈ రాష్ట్రాల్లో పోలింగ్ ప్రారంభం కానుంది. ఈ నెల 19న ఎన్నికల కౌంటింగ్ నిర్వహించనున్నట్టు ఎన్నికల కమిషన్ వెల్లడించింది.