ఇరాక్ వెళ్లితే ఇంక అంతే...! | Don't go to Iraq, Goa panel tells job seekers | Sakshi
Sakshi News home page

ఇరాక్ వెళ్లితే ఇంక అంతే...!

Jul 30 2014 2:17 PM | Updated on Jul 6 2019 12:42 PM

ఉద్యోగం కోసం ఇరాక్ కు వెళ్లవద్దని యువకులకు గోవా రాష్ట్రానికి సంబంధించిన ప్రవాస భారతీయ వ్యవహారాల శాఖ హెచ్చరించింది.

పానాజీ: ఉద్యోగం కోసం ఇరాక్ కు వెళ్లవద్దని యువకులకు గోవా రాష్ట్రానికి సంబంధించిన ప్రవాస భారతీయ వ్యవహారాల శాఖ హెచ్చరించింది. బాగ్దాద్ లోని భారతీయ రాయబార కార్యాలయంలో విచారించిన తర్వాతే ఈ హెచ్చరిక చేస్తున్నామని ఎన్నారై విభాగా డైరెక్టర్ యూడీ కామత్ తెలిపారు. 
 
ఇరాక్ లో అంతర్గత పరిస్థితులు దారుణంగా ఉన్న కారణంగా ఉద్యోగం కోసం యువకులు వెళ్లకూడదని.. ఆ దేశానికి ప్రయాణించకూడదని ఆంక్షల్ని విధించారు. ఇరాక్ సంక్షోభంలో నలభై ఆరు మంది భారతీయ నర్సులు చిక్కుకున్న సంగతి తెలిసిందే. వారిని కేంద్ర ప్రభుత్వం సురక్షితంగా భారత్ కు తీసుకువచ్చిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement