అంతకు మించి విరాళాలు ఇవ్వొద్దు: ఐటీ శాఖ వార్నింగ్

Do not donate over 2000 rupees for political parties - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: రాజకీయ పార్టీలకు విరాళాలు ఇకనుంచి నగదు రూ.2000కు మించి ఇవ్వకూడదని ఆదాయపు పన్ను శాఖ దేశ ప్రజలను హెచ్చరించింది. ఎవరైనా హెచ్చరికలను ఉల్లంఘించి అంతకుమించి నగదు నేరుగా అందజేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మంగళవారం నాడు అధికారులు ప్రకటించారు. నిధుల దుర్వినియోగం, విరాళాల పేరుతో అక్రమ దందాలను అరికట్టేందుకు ఆదాయపు పన్నుశాఖ (కేంద్ర ప్రభుత్వం) ఎలక్ట్రానిక్ బాండ్ల విధానాన్ని ప్రవేశపెట్టిన విషయం విదితమే. ఈ క్రమంలోనే రాజకీయ పార్టీలకు విరాళాలపై నిఘా పెట్టేందుకు, నల్లధనం అంశాన్ని సీరియస్‌గా తీసుకోవడంలో భాగంగా అధికారులు నిర్ణయం తీసుకున్నారు.   

ఏ రాజకీయ పార్టీకైనా నేరుగా నగదు రూపంలో రూ.2 వేలకు మించి విరాళాలు ఇవ్వకూడదు. దాంతో పాటు స్థిరాస్తుల క్రయ, విక్రయాల కోసం నగదు రూ.20 వేలకు మించి చేతులు మారితే కఠిన చర్యలతో పాటు భారీ జరిమానా కట్టాల్సి ఉంటుంది. వ్యాపారులైతే రూ. 10 వేలకు మించి నగదు రూపంలో చెల్లింపులు చేయకూడదు. గో క్యాష్‌లెస్, గో క్లీన్’ అంటూ ఈ ప్రకటన విడుదల చేయడం గమనార్హం. ఎక్కడైనా నల్లధనం ఉన్నట్లు తెలిసినా, బినామీ ఆస్తుల వివరాలకు సంబంధించిన వివరాలు తెలిస్తే mailto:blackmoneyinfo@incometax.gov.in"\nblackmoneyinfo@incom etax.gov.in కు మెయిల్ చేసి సమాచారం అందించాలని అధికారులు కోరారు. రాజకీయ పార్టీలకు విరాళాలు ఇచ్చేవారు రుణదాతల పేరు లేకుండా 15 రోజుల పాటు వ్యాలిడిటీ ఉండేలా ఎస్‌బీఐ ఎలక్టోరల్ బాండ్లు కోనుగోలు చేయాల్సి ఉంటుంది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top