విజయకాంత్ కు షాక్ | DMDK breaks into 2 parties | Sakshi
Sakshi News home page

విజయకాంత్ కు షాక్

Apr 10 2016 1:55 PM | Updated on Sep 3 2017 9:38 PM

విజయకాంత్ కు షాక్

విజయకాంత్ కు షాక్

'కెప్టెన్' విజయకాంత్ కు షాక్ తగిలింది. డీఎండీకేలో రగిలిన ముసలం పార్టీ విచ్ఛిన్నానికి దారి తీసింది.

చెన్నై: 'కెప్టెన్' విజయకాంత్ కు షాక్ తగిలింది. డీఎండీకేలో రగిలిన ముసలం పార్టీ విచ్ఛిన్నానికి దారి తీసింది. డీఎండీకే రెండుగా చీలిపోయింది. తిరుగుబాటు నేత, ఎమ్మెల్యే చంద్రకుమార్.. డీఎండీకే  నుంచి విడిపోయి కొత్త పార్టీ పెట్టారు. పీడీఎండీకే పేరుతో పార్టీ ఏర్పాటు చేశారు. చెన్నై టీ నగర్ లోని త్యాగరాజ కల్యాణ మండపంలో ఆదివారం ఉదయం 10 గంటలకు అసంతృప్త నాయకులతో చంద్రకుమార్ సమావేశమయ్యారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో విజయకాంత్ తీసుకున్న నిర్ణయాలపై చర్చించారు.

డీఎంకేతో పొత్తుకే ఎక్కువశాతం మొగ్గుచూపిన ఎమ్మెల్యేలు, నేతలను కాదని ప్రజా సంక్షేమ కూటమితో జతకట్టడంపై తిరుగుబాటు నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇక విజయకాంత్ తో కొనసాగరాదని వారందరూ నిర్ణయించుకున్నారు. కొత్త పార్టీ ఏర్పాటుకు మొగ్గుచూపారు. చంద్రకుమార్ నాయకత్వంలో పీడీఎండీకే పార్టీ ఏర్పాటు చేస్తున్నట్టు ఈ సందర్భంగా ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో డీఎండీకే రెండు పార్టీలుగా చీలిపోవడం రాజకీయవర్గాల్లో సంచలనం రేపింది. ఇంకా ఎన్ని సిత్రాలు జరుగుతాయోనని తమిళ ప్రజలు చర్చించుకుంటున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement