రాజీవ్‌ యుద్ధనౌకను వాడుకున్నారా?

Did Rajiv Gandhi Holiday On INS Viraat? - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీ ఐఎన్‌ఎస్‌ విరాట్‌ తన వ్యక్తిగత ట్యాక్సిగా వాడుకున్నారని ప్రధాని నరేంద్ర మోదీ గతంలో సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ ఏడాది మే నెలలో రాంలీలా మైదానంలో నిర్వహించిన సమావేశంలో మోదీ మాట్లాడుతూ.. ‘‘మిత్రులారా! యుద్ధనౌకను తమ సొంత అవసరాలకు వాడుకున్నట్లు.. మీరు ఎప్పుడైనా విన్నారా? కానీ కాంగ్రెస్‌ కుటుంబం దేశానికి గర్వకారణం అయిన ఐఎన్‌ఎస్‌ విరాట్‌ను హాలీడే ట్రిప్‌కు వెళ్లడానికి వ్వక్తిగత ట్యాక్సిగా వాడుకుంది’’ అని విమర్శించారు. రాజీవ్ గాంధీ ఆయన కుటుంబం ఐఎన్ఎస్ విరాట్ యాత్రపై 1980లో ఇండియా టుడే మ్యాగజైన్ ప్రచురించిన 'ఇడిలిక్ వెకేషన్ ఆఫ్‌ దీ గాంధీ లక్షద్వీప్ అర్చిపీలాగో'  ఆర్టికల్‌ను మోదీ ట్వీట్ చేశారు.

ఆ ఆర్టికల్‌లో రాజీవ్‌ గాంధీ తన భార్య సోనియా గాంధీ, పిల్లలు రాహుల్‌, ప్రియాంక గాంధీలతో పాటు ఆయన అత్త మామలతో కలిసి ఐఎన్‌ఎస్‌ విరాట్‌లో  విహర యాత్రకు వెళ్లినట్లుగా ఉంది. అయితే దీనిలో ఎంత వరకు నిజాలు ఉన్నాయో తెలుసుకోవడాని ఇండియా టూడే, భారత నేవి అధికారులను ఇంటర్వ్యూ చేసింది. దానిలో భాగంగా ఇండియన్‌ నేవీ యుద్ధ నౌకలను వ్యక్తిగత అవసరాలకు ఎన్నిసార్లు ఉపయోగించారు అనే ప్రశ్నకు.. నేవీ ఇంటిగ్రేటెడ్ అధికారులు భారత నౌకల్లో అనాధికార, ప్రైవేట్‌ ప్రయాణాలకు అనుమతి లేదని' సమాధానం ఇచ్చింది. 1987లో అప్పటి ప్రధాని రాజీవ్‌ గాంధీ విహార యాత్రకు ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌ను ఉపయోగించారా? అనే ప్రశ్నకు భారత నావికదళం' దివంగత ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ 1987 డిసెంబర్ 28న  త్రివేండ్రం నుంచి ఐఎన్ఎస్ విరాట్‌ను ప్రారంభించారని, 1987 డిసెంబర్ 29 న మినికాయ్ దీవి నుంచి తిరిగి బయలుదేరారు. రాజీవ్ గాంధీతో ఎవరు వెళ్లారు అనే ప్రశ్నకు నావికాదళం ఇలా సమాధానం ఇచ్చింది 'సోనియా గాంధీతో కలిసి రాజీవ్ గాంధీ విరాట్‌ను ప్రారంభించినట్లు' తెలిపారు.

Ever imagined that a premier warship of the Indian armed forces could be used as a taxi for a personal holiday?

One Dynasty did it and that too with great swag.

Read this and share widely!
https://t.co/OcqpHsQ8xM

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top