ముంబైలో దావుద్ ఇబ్రహీం సోదరి మృతి | Dawood Ibrahim's sister dies of heart attack in Mumbai | Sakshi
Sakshi News home page

ముంబైలో దావుద్ ఇబ్రహీం సోదరి మృతి

Jul 6 2014 7:45 PM | Updated on Sep 28 2018 3:39 PM

అండర్ వరల్డ్ డాన్ దావుద్ ఇబ్రహీం సోదరి హసీనా పర్కర్ మరణించింది.

ముంబై: అండర్ వరల్డ్ డాన్ దావుద్ ఇబ్రహీం సోదరి హసీనా పర్కర్ మరణించింది. ఆదివారం మధ్యాహ్నం ముంబైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఆమె గుండె పోటుతో చనిపోయినట్టు పోలీసులు తెలిపారు. ఆమె వయసు 55 సంవత్సరాలు.

మధ్యాహ్నం హసీనాకు గుండెలో నొప్పి రావడంతో డొంగ్రిలోని ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ఆమెను కాపాడేందుకు 45 నిమిషాలు శ్రమించినా ఫలితం లేకపోయింది. హసీనా మృతదేహాన్ని దక్షిణ ముంబైలోని ఆమె నివాసానికి తీసుకెళ్లారు. 1991లో ఆమె భర్త ఇస్మాయిల్ పర్కర్ను ప్రత్యర్థులు కాల్చిచంపారు. ఆ తర్వాత హసీనా అండర్ వరల్డ్ కార్యకలపాల్లో పాల్గొన్నారు. ఆమెపైన కేసులు కూడా నమోదైనట్టు ముంబై పోలీసులు తెలిపారు. ఇదిలావుండగా దేశం విడిచి పారిపోయిన దావుద్ అజ్ఞాతంలో ఉన్న సంగతి తెలిసిందే. పాకిస్థాన్లో ఉన్నాడని పోలీసులు భావిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement