జమ్మూకాశ్మీర్లో ఇటీవల సంభంవించిన వరదలకు అపార నష్టం వాటిల్లింది.
శ్రీనగర్: జమ్మూకాశ్మీర్లో ఇటీవల సంభంవించిన వరదలకు అపార నష్టం వాటిల్లింది. కాశ్మీర్లోయలో దాదాపు 3675 కోట్ల రూపాయల విలువైన పంటలు ధ్వంసమయ్యాయి.
వర్షాలు, వరదలు, అత్యల్ప ఉష్ణోగ్రతల కారణంగా 1.35 లక్షల హెక్టార్లలో పూర్తిగాను, మరో 1.65 హెక్టార్లలో తీవ్రంగాను పంటలు నష్టపోయినట్టు వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. వర్షాలు వల్ల భూములు కూడా కోతకు గురైనట్టు చెప్పారు. రైతులకు నష్టపరిహారం అందించేందుకు అధికారుల ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.