గోరక్షకులకు సుప్రీం వార్నింగ్‌

Cow Vigilantism SC Says No One Can Take Law Into Their Hands - Sakshi

న్యూఢిల్లీ : గోరక్షణ పేరిట చట్టాన్ని ఎవరు చేతులోకి తీసుకోవద్దని మంగళవారం సుప్రీం కోర్టు మరోసారి హెచ్చరించింది. గోరక్షణతో హింసాత్మక ఘటనలు చెలరేగకుండా రాష్ట్ర ప్రభుత్వాలు ముందుస్తు చర్యలు తీసుకోవాలని కూడా సూచించింది. ఇక గతేడాది నవంబర్‌లోనే ఈ వ్యవహారంపై ఆగ్రహం వ్యక్తం చేసిన దేశ అ‍త్యున్నత న్యాయస్థానం.. ఈ హింసకు చెక్‌ పెట్టాలని, ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వాలన్నీ టాస్క్‌ఫోర్స్‌లను ఏర్పాటుచేయాలని అప్పట్లో ఆదేశించింది. ఓ సీనియర్‌ పోలీసు అధికారి నోడల్‌ ఆఫీసర్‌గా నియమిస్తూ టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేయాలని కూడా తేల్చిచెప్పింది.

అయితే ఈ తీర్పుకు రాజస్తాన్‌, హర్యానా, ఉత్తరప్రదేశ్‌లు కట్టుబడి లేవని జాతిపిత మహాత్మా గాంధీ మనవడు తుషార్‌ గాంధీ పిటీషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ వాదనలు విన్న చీఫ్‌ జస్టిస్‌ దీపక్‌ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం ఇది లా అండ్‌ ఆర్డర్‌ విషయమని, ప్రతి రాష్ట్రం బాధ్యతగా తీసుకోవాలని హెచ్చరించింది. గోరక్షణ పేరుతో దాడులు చేయడం హింసను ప్రేరిపించడమేనని, ఇది క్రైమ్‌ అని పిటిషనర్‌ తరపు వాదనలు విన్న ధర్మాసనం.. ఏ ఒక్కరు కూడా చట్టాన్ని చేతులోకి తీసుకోవద్దని, ఈ విషయంలో రాష్ట్రాలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top