
తమిళనాడు,కొరుక్కుపేట: కరోనా వైరస్ వ్యాప్తిలో కళ్లు ముఖ్యపాత్ర వహిస్తున్నాయని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అగర్వాల్ కంటి ఆస్పత్రి వైద్యసేవల విభాగం డాక్టర్ ప్రీతి రవిచందర్ తెలిపారు. ఆయన ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ కరోనా వైరస్‌ను నివారించడంలోనూ, వ్యాపింపజేయడంలోనూ కళ్లు ముఖ్య పాత్ర వహిస్తున్నాయని తెలిపారు. వ్యక్తులు దగ్గినప్పుడు నీటి కణాలు కంట్లోకి పడినా కరోనా వైరస్ వ్యాపిస్తుందన్నారు. ఈ వైరస్ దేహంలోని అన్ని భాగాలకు చేరుతుందని, తద్వారా ప్రాణాపాయం కలుగుతుందని వివరించారు. సబ్బుతో తరచూ చేతులు శుభ్రం చేసుకోవడం, వేడి నీరు, వేడి ఆహార పదార్ధాలు తీసుకోవడం మంచిదన్నారు. నీటిని వీలైనంత ఎక్కువసార్లు తాగాలన్నారు.