వారం పాటు అహ్మదాబాద్‌ షట్‌‌డౌన్ | Coronavirus : Ahmedabad Shut Down For A Week | Sakshi
Sakshi News home page

కరోనా : పాలు, మందు దుకాణాలు తప్ప అన్ని బంద్‌

May 7 2020 5:33 PM | Updated on May 7 2020 7:30 PM

Coronavirus : Ahmedabad Shut Down For A Week - Sakshi

కూరగాయల వంటి నిత్యావసరాలు అమ్మే దుకాణాలకు కూడా అనుమతులు లేవని ప్రభుత్వం స్పష్టం చేసింది.

అహ్మదాబాద్‌ : కరోనా వైరస్‌ మహమ్మారి గుజరాత్‌లో విలయ తాండవం చేస్తోంది. ముఖ్యంగా అహ్మదాబాద్‌లో ఈ వైరస్‌ అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతోంది. దీంతో అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ న‌గ‌రంలో లాక్‌డౌన్‌ను ఖచ్చితంగా పాటించాలని నిర్ణయించింది. కేసులు, మరణాల తీవ్రత దృష్ట్యా  నగరంలో పాలు, మందు దుకాణాలు తప్ప మినహా అన్ని వారం రోజుల పాటు మూసివేయాలని అధికారులను ఆదేశించింది. ఈ నిబంధనలు మే 7 నుంచి 15 వరకు అమల్లో ఉంటాయని పేర్కొంది. కూరగాయల వంటి నిత్యావసరాలు అమ్మే దుకాణాలకు కూడా అనుమతులు లేవని ప్రభుత్వం స్పష్టం చేసింది. లాక్‌డౌన్‌ను కచ్చితంగా అమలు చేయడం కోసం పారామిలిటరీ ఫోర్స్‌ను కూడా రంగంలోకి దించింది. (చదవండి : ఆ రెండు రాష్ట్రాల్లో కరోనా విజృంభణ)

కాగా, గుజరాత్‌ వ్యాప్తంగా బుధవారం 382 కొత్త కరోనా కేసులు నమోదు కాగా, వాటిలో 291 కేసులు అహ్మదాబాద్‌ చెందినవే కావడం గమనార్హం.  క‌రోనా ప్రభావితప్రాంతం జమాల్‌పూర్‌లో ఇప్పటివరకు 728 కరోనా కేసులు నమోదయ్యాయి. జమాల్‌పూర్‌లో కరోనా వైరస్ కారణంగా 79 మంది మరణించారు. ఈ ప్రాంతంలో తబ్లిగి జమాత్ నిర్లక్ష్యం కారణంగా కరోనా విప‌రీతంగా వ్యాప్తి చెందింది. కాగా, రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం నాటికి  కరోనా బాధితుల సంఖ్య 6625 చేరింది. ఈ మహమ్మారి బారిన పడి ఇప్పటి వరకు 396 మంది మృతి చెందారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement