కరోనా కేళి.. జేబులు ఖాళీ!

Corona Effects On Indian People Economy - Sakshi

దేశ ప్రజల ఆదాయంపై కరోనా ఎఫెక్ట్‌

ప్రతి 10 మందిలో 8 మంది ఆర్జనపై తీవ్ర ప్రభావం

 నెలవారీగా రూ. 3 వేల నుంచి రూ.లక్ష వరకు తగ్గుదల

 గ్రామాల్లో 88%, పట్టణాల్లో 75% కుటుంబాలపై ఎఫెక్ట్‌

 దేశవ్యాప్తంగా కొత్తగా 18 కోట్ల మంది పేదరికంలో మగ్గే చాన్స్‌

 యూనివర్సిటీ ఆఫ్‌ షికాగో అధ్యయనంలో వెల్లడి

 మార్చి నుంచి జూన్‌ వరకు 27 రాష్ట్రాల్లో సాగిన సర్వే

సాక్షి, హైదరాబాద్‌: దేశంలో కరోనా వ్యాప్తి ప్రజల జీవితాలతోపాటు వారి ఆర్థిక స్థితిగతులనూ తిరోగమనంలోకి నెట్టేసింది. ఈ మహమ్మారి నియంత్రణ కోసం కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌ దేశవ్యాప్తంగా ప్రతి 10 మందిలో 8 మంది ఆదాయంపై తీవ్ర ప్రభావం చూపిందని, దేశంలోని 84 శాతం కుటుంబాలు లాక్‌డౌన్‌ సమయంలో ఆదాయం కోల్పోయాయని తాజా అధ్యయనంలో తేలింది. యూనివర్సిటీ ఆఫ్‌ షికాగో, సెంటర్‌ ఫర్‌ మానిటరింగ్‌ ఇండియన్‌ ఎకానమీ సంయుక్తంగా ఈ ఏడాది మార్చి నుంచి జూన్‌ వరకు నిర్వహించిన ఈ సర్వే దేశ ప్రజలపై, వారి ఆర్థిక పరిస్థితిపై కరోనా చూపిన ప్రభావాన్ని తేటతెల్లం చేసింది. 27 రాష్ట్రాల్లో 6 వేలకుపైగా కుటుంబాలపై కన్జూమర్‌ పిరమిడ్స్‌ హౌస్‌హోల్డ్‌ సర్వే జరిగింది.(అన్నీ ఆపేయండి..)

గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ నష్టం...
ఈ సర్వే ప్రకారం కరోనా వైరస్‌ ప్రభావం దేశంలోని దిగువ మధ్యతరగతి ప్రజలపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. ఎక్కువ ఆదాయాన్ని ఈ వర్గాలు కోల్పోగా వ్యవసాయంపై ఆధారపడ్డ పేద వర్గాల ఆదాయంలో పెద్దగా మార్పు రాలేదు. అలాగే ఉన్నతస్థాయిలో ఆదాయం వచ్చే పట్టణాల్లో కంటే దిగువ మధ్యతరగతి వర్గాలుండే గ్రామీణ ప్రాంతాల్లో ఆదాయం ఎక్కువగా తగ్గిపోయిందని సర్వే తెలిపింది. గ్రామీణ ప్రాంతాల్లో 88 శాతం కుటుంబాలపై ఎఫెక్ట్‌ కనిపిస్తే, పట్టణ ప్రాంతాల్లో అది 75 శాతం కుటుంబాలపై ప్రభావం చూపింది. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో కలిపి ప్రతి కుటుంబం నెలకు ఆర్జించే ఆదాయంలో రూ. 3,801 నుంచి రూ. 1,01,902 వరకు కోల్పోవాల్సి వచ్చిందని అధ్యయనం వివరించింది.

తెలంగాణ, ఏపీలో కాస్త నయం...
కరోనా లాక్‌డౌన్‌ వల్ల దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాల్లో ప్రజల ఆదాయం పడిపోయింది. ముఖ్యంగా బిహార్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్‌ రాష్ట్రాల్లో 90–100 శాతం కుటుంబాల ఆదాయం తగ్గిపోగా తెలంగాణలో దేశంలోనే అత్యల్పంగా 50–70 శాతం, ఆంధ్రప్రదేశ్‌లో 60–70 శాతం కుటుంబాల ఆదాయంలో తగ్గుదల కనిపించింది. తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్రలలో 70–80 కుటుంబాల రాబడి తగ్గింది.

క్రమంగా సాధారణ స్థితికి...
దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ ఎత్తేశాక నిరుద్యోగిత రేటు మార్చి నెల స్థాయికి పరిమితం కావడం ఊరట కలిగిస్తోంది. మార్చి 22న దేశంలో నిరుద్యోగిత రేటు 8.4 శాతం ఉండగా మే 3 నాటికి అది అత్యధికంగా 27 శాతానికి చేరి జూన్‌ 21 నాటికి మళ్లీ 8.5 శాతానికి పడిపోయిందని గణాంకాలు చెబుతున్నాయి. ఇక శ్రామిక భాగస్వామ్యం కూడా మార్చి స్థాయికి జూన్‌ నెలలో వచ్చేసింది.

దశాబ్దాల గణాంకాలు పునరావృతం..
ఐక్యరాజ్యసమితి లెక్కల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా పేదరిక గణాంకాలు పెరిగిపోతున్నాయి. కరోనా ప్రభావంతో 1990 నాటి పరిస్థితులు పునరావృతమయ్యే అవకాశం ఉందని యూఎన్‌ యూనివర్సిటీ వరల్డ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ డెవలప్‌ మెంట్‌ ఎకనామిక్స్‌ రీసెర్చ్‌ ఇటీవలి ప్రచురణలో వెల్లడించింది. రోజుకు ఒక వ్యక్తి 1.9 డాలర్లకన్నా తక్కువ సంపాదన ఉన్న వారిని పేదలుగా గుర్తిస్తే ఆ లెక్కన ప్రపంచ జనాభాలో 17 కోట్ల మంది పేదరికంలోకి వెళ్తారని తెలిపింది. ఇందులో దాదాపు సగం మంది భారత్‌లోనే ఉంటారని వెల్లడిం చింది. ప్రస్తుతం భారత్‌లో పేదరికం శాతం 13.3 గా ఉందని, పేద భారతీయుల సంఖ్య 17.49 కోట్లని తెలిపింది. దేశ జీడీపీ పతనాన్నిబట్టి మరింత మంది పేదరికంలోకి వెళ్తారని, జీడీపీ 5 శాతం పడిపోతే మొత్తం 3.54 కోట్ల మంది వరకు, 10 శాతం తగ్గితే 7.52 కోట్ల మంది, 20 శాతం తగ్గితే 17.85 కోట్ల మంది తీవ్ర పేదరికం లోకి జారిపోతారని అంచనా వేసింది. దేశంలో 2005 నుంచి 2017 వరకు 27.1 కోట్ల మంది పేదరికం నుంచి బయట పడ్డారని ప్రభుత్వం అంచనా వేస్తున్న సమయంలో కరోనా మహమ్మారి మళ్లీ అదే స్థాయిలో దేశాన్ని పేదరికంలోకి తీసుకు పోతుందనే ఆందోళన ఆర్థికవేత్తల్లో వ్యక్తమవుతోంది. 

గత మూడు నెలల్లో దేశంలో శ్రామిక భాగస్వామ్యం, నిరుద్యోగిత రేటు అంచనాలు

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని వార్తలు

23-10-2020
Oct 23, 2020, 11:01 IST
కరోనా వ్యాక్సిన్ తయారీలో దేశీయ సంస్థ సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ) భారీ సన్నాహాలు ప్రారంభించింది. 
23-10-2020
Oct 23, 2020, 10:20 IST
సాక్షి, న్యూఢిల్లీ: భారత్‌లో గడిచిన 24 గంటల్లో 54,366 కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల...
23-10-2020
Oct 23, 2020, 09:35 IST
సాక్షి, ముంబై: ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాక్సిన్ కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్న వేళ ప్రపంచంలోనే అతిపెద్ద టీకా తయారీ సంస్థ...
22-10-2020
Oct 22, 2020, 18:41 IST
సాక్షి,అమరావతి : ఏపీలో కరోనా పరీక్షలు రికార్డు స్థాయిలో కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ గురువారం విడుదల చేసిన హెల్త్‌...
22-10-2020
Oct 22, 2020, 18:37 IST
సాక్షి, హైదరాబాద్‌ : ప్రపంచ వ్యాప్తంగా విజృంభిస్తున్న ప్రాణాంతక కరోనా వైరస్‌ విరుగుడును కనిపెట్టేందుకు శాస్త్రవేత్తలు రేయింబవళ్లు కష్టపడుతున్నారు. వ్యాక్సిన్‌ తయారీ కోసం...
22-10-2020
Oct 22, 2020, 17:50 IST
క‌మెడియ‌న్, న‌టుడు సుడిగాలి సుధీర్‌కు క‌రోనా సోకిందంటూ గ‌త కొంత కాలంగా వార్త‌లు షికార్లు చేస్తున్నాయి. దీనిపై సుధీర్ ఎలాంటి...
22-10-2020
Oct 22, 2020, 17:27 IST
కరోనా వైరస్‌ బారిన పడిన 28 ఏళ్ల బ్రెజీలియన్‌ యువ డాక్టర్‌ మరణంపై ప్రపంచ వ్యాప్తంగా రాద్ధాంతం చెలరేగుతోంది.
22-10-2020
Oct 22, 2020, 14:08 IST
రాజశేఖర్‌ ఆరోగ్యం కాస్త విషమంగా ఉందని గురువారం ఆయన కూతురు శివాత్మిక ట్వీట్‌ చేసింది
22-10-2020
Oct 22, 2020, 13:46 IST
సాక్షి,ముంబై: మహారాష్ట్రలో కరోనా మహమ్మారి ప్రకంపనలు కొనసాగుతున్నాయి. తాజాగా ఎన్‌సీపీ నేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ కోవిడ్-19...
22-10-2020
Oct 22, 2020, 13:30 IST
బ్రసిలియా:  చైనా  రూపొందించిన కరోనా వ్యాక్సిన్‌ను తమ ప్రభుత్వం కొనుగోలు చేయదని బ్రెజిల్‌ అధ్యక్షుడు జైర్‌ బోల్సోనారో వెల్లడించారు. చైనా సినోవిక్‌...
22-10-2020
Oct 22, 2020, 10:05 IST
లండన్‌‌: కోవిడ్‌ చికిత్స కోసం ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ఆశలు పెట్టుకున్నా ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌ క్లినకల్‌ ట్రయల్స్‌లో పాల్గొన్న ఓ వ్యక్తి అనారోగ్యానికి...
22-10-2020
Oct 22, 2020, 09:45 IST
న్యూఢిల్లీ : భారత్‌లో గడిచిన 24 గంటల్లో 55,838 కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 77,06,946కి చేరింది....
22-10-2020
Oct 22, 2020, 04:45 IST
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో రికవరీ కేసుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. ఒకేరోజు 4,739 మంది కోలుకోవడంతో ఇప్పటి...
21-10-2020
Oct 21, 2020, 20:05 IST
న్యూఢిల్లీ: ప్రాణాంతక కరోనా వైరస్‌ విజృంభణ తీవ్రంగా ఉన్న అమెరికా, బ్రిటన్‌ దేశాల్లో ప్రజలకు కాస్త ఉపశమనం కలిగించే వార్తలు...
21-10-2020
Oct 21, 2020, 17:59 IST
సాక్షి, అమరావతి : ఏపీలో గడిచిన 24 గంటల్లో 74,422 మందికి కరోనా  నిర్థారణ పరీక్షలు నిర్వహించగా 3,746 మందికి కోవిడ్‌...
21-10-2020
Oct 21, 2020, 17:02 IST
లండన్‌ : ప్రపంచ దేశాల ప్రజలను ఇప్పటికీ భయాందోళనలకు గురిచేస్తోన్న ప్రాణాంతక కరోనా వైరస్‌ బారిన పడకుండా ఉండేందుకు నేడు...
21-10-2020
Oct 21, 2020, 13:27 IST
సాక్షి, విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్‌ పాజిటివ్ కేసులను తగ్గించటంలో విజయం సాధించామని, కరోనాతో మృత్యువాత పడేవారి సంఖ్య...
21-10-2020
Oct 21, 2020, 11:37 IST
సాక్షి, న్యూఢిల్లీ: ఆన్‌లైన్ దిగ్గజం అమెజాన్ తన ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. కోవిడ్-19 మహమ్మారి, లాక్ డౌన్ నిబంధనలతో టెక్ సంస్థలు, కార్పొరేట్ దిగ్గజాలు,...
21-10-2020
Oct 21, 2020, 10:20 IST
న్యూఢిల్లీ : భారత్‌లో కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య 76 లక్షల మార్కును దాటింది. గడిచిన 24 గంటల్లో 54,044 కరోనా కేసులు నమోదయ్యాయి....
21-10-2020
Oct 21, 2020, 10:14 IST
సాక్షి, చెన్నై: పండుగ సీజన్ రావడంతో దేశంలోని చాలా ప్రాంతాల్లో షాపింగ్ సందడి నెలకొంది.  ముఖ్యంగా కరోనా వైరస్, లాక్ డౌన్ ఆంక్షలతో...
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top