యువతి కిడ్నాప్..ఎమ్మెల్యేపై కేసు నమోదు | Congress MLA booked for kidnapping woman Patna | Sakshi
Sakshi News home page

యువతి కిడ్నాప్..ఎమ్మెల్యేపై కేసు నమోదు

Jan 28 2016 5:42 PM | Updated on Mar 18 2019 8:57 PM

యువతి కిడ్నాప్..ఎమ్మెల్యేపై కేసు నమోదు - Sakshi

యువతి కిడ్నాప్..ఎమ్మెల్యేపై కేసు నమోదు

20 ఏళ్ల యువతిని కిడ్నాప్ చేశాడన్న ఆరోపణలతో గురువారం కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే పై కేసు నమోదు చేశారు.

పాట్నా: 20 ఏళ్ల యువతిని కిడ్నాప్ చేశాడన్న ఆరోపణలతో గురువారం కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే పై కేసు నమోదు చేశారు. ఈ సంఘటన బిహార్లోని  సోన్కుక్రా గ్రామంలో చోటుచేసుకుంది. యువతి తండ్రి అభయ్ సింగ్ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాలు.. గురువారం ఉదయం బిక్రం నియోజక వర్గానికి చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే సిద్దార్థ్ తన కూతురుని కిడ్నాప్ చేసి తీసుకువెళ్లాడని బాధితుడు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు.

అభయ్ సింగ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఐపీసీ సెక్షన్ 363 కింద ఎమ్మెల్యేపై కేసు నమోదు చేశామని ఎస్పీ ద్రుతి సాయిలీ తెలిపారు. ఎమ్మెల్యే ఫోన్లో అందుబాటులో లేడని, దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement