రూ. 100 కోట్లతో అపార్ట్‌మెంట్ కొనుగోలు! | congress leader son purchases triplex flat worth rs 100 crores | Sakshi
Sakshi News home page

రూ. 100 కోట్లతో అపార్ట్‌మెంట్ కొనుగోలు!

Aug 23 2016 2:25 PM | Updated on Sep 4 2017 10:33 AM

రూ. 100 కోట్లతో అపార్ట్‌మెంట్ కొనుగోలు!

రూ. 100 కోట్లతో అపార్ట్‌మెంట్ కొనుగోలు!

ఒకవైపు ముంబై మహానగరంలో నివాస గృహాల మార్కెట్ బాగా పతనావస్థలో ఉండగా.. కాంగ్రెస్ నాయకుడి కుమారుడు ఒకరు ఏకంగా వంద కోట్ల రూపాయలతో ఓ అపార్టుమెంట్ కొన్నారు.

ఒకవైపు ముంబై మహానగరంలో నివాస గృహాల మార్కెట్ బాగా పతనావస్థలో ఉండగా.. కాంగ్రెస్ నాయకుడి కుమారుడు ఒకరు ఏకంగా వంద కోట్ల రూపాయలతో ఓ అపార్టుమెంట్ కొన్నారు. బిహార్ మాజీ గవర్నర్ డీవై పాటిల్ కుమారుడు అజింక్య పాటిల్.. వర్లి సమీపంలోని సిల్వరిన్ టెర్రస్ ప్రాంతంలో ఓ ట్రిప్లెక్స్ అపార్టుమెంటును కొన్నారు. సముద్రానికి ఎదురుగా ఉండే ఈ 23 అంతస్తుల భవనం గురించి ముంబైలో తెలియనివాళ్లు అంటూ దాదాపుగా ఉండరు. ఈ డీల్ మార్కెట్లో పెను మార్పులకు దారితీస్తుందని రియల్ ఎస్టేట్ వర్గాలు అంటున్నాయి.

పాటిల్‌కు చెందిన ఏఐపీఎస్ రియల్ ఎస్టేట్ అనే కంపెనీ పేరు మీద ఈ ఫ్లాటు కొన్నారు. ఈ ఆస్తిని రూ. 95.4 కోట్లు పెట్టి కొన్నామని, దానికి రూ. 4.7 కోట్ల స్టాంపు డ్యూటీ చెల్లించామని కంపెనీ వర్గాలు తెలిపాయి. 21, 22,  23 అంతస్తులలో ఉన్న ట్రిప్లెక్స్‌ను పాటిల్ కొన్నారు. దీనికి అద్భుతమైన టెర్రస్‌తో పాటు మూడో పోడియం లెవెల్‌లో పార్కింగ్ కూడా ఉంది. తాము ఈ ఆస్తిని కొనుగోలు చేసిన మాట వాస్తవమేనని, ఇది తమ కంపెనీకి మంచి పెట్టుబడి అవుతుందని కంపెనీ ప్రతినిధి దిలీప్ కవాడ్ చెప్పారు. సిల్వరిన్ బంగ్లా అనే ఓ బంగ్లాను అపార్టుమెంటుగా మార్చారు. అందులోనే ఇప్పుడు ఓ ట్రిప్లెక్స్ ఫ్లాటును పాటిల్ కొన్నారు.

Advertisement

పోల్

Advertisement