కేరళలో యూపీ సీఎం పాదయాత్ర | UP CM Yogi Adityanath joins BJP's Janaraksha Yatra in Kerala | Sakshi
Sakshi News home page

కేరళలో యూపీ సీఎం పాదయాత్ర

Oct 5 2017 4:44 AM | Updated on Oct 5 2017 4:44 AM

UP CM Yogi Adityanath joins BJP's Janaraksha Yatra in Kerala

కీచెరి (కేరళ): ప్రమాదకర ‘లవ్‌ జీహాద్‌’ కట్టడిలో కేరళ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ విమర్శించారు. కేరళలో అధికార సీపీఎం పాల్పడుతున్న హింసకు వ్యతిరేకంగా నిర్వహించిన పాద యాత్రలో పాల్గొన్నారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా బీజేపీ ప్రారంభించిన జన రక్షా యాత్రలో ఆయన మాట్లాడుతూ.. బెదిరింపులకు దిగి అధికారం చేజిక్కించుకోవడం సీపీఎంకు అలవాటేనని ధ్వజమెత్తారు.

సనాతన హిందూ సంప్రదాయంలో కేరళకు ప్రముఖ స్థానం ఉందని, విదేశీ కమ్యూనిజం భావాలు అక్కడకి ఎలా ప్రవేశించాయో అర్థం కావడంలేదన్నారు. ‘సీపీఎం ఓ వైపు సామ్యవాద సూత్రాలు వల్లిస్తూనే మరోవైపు జీహాద్‌ టెర్రరిజాన్ని ప్రోత్సహిస్తోంది. పవిత్ర భూమి అయిన కేరళలో ఇలాంటి పోకడలకు చోటులేదు. ఇక్కడ కేవలం జాతీయ భావాలకే ప్రచారం కల్పించాలి’ అని అన్నారు. అధికార పార్టీ కనుసన్నల్లోనే రాష్ట్రంలో హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఓ హిందూ మహిళ మతం మార్చుకుని ముస్లిం వ్యక్తిని పెళ్లాడిన ఉదంతాన్ని ఉదహరిస్తూ...‘లవ్‌ జీహాద్‌’ ప్రమాదకర ధోరణి అని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement