వెంకయ్యతో ముఫ్తీ భేటీ | cm mehabooba meeting with venkaiah naidu | Sakshi
Sakshi News home page

వెంకయ్యతో ముఫ్తీ భేటీ

Apr 13 2016 11:45 AM | Updated on Sep 3 2017 9:51 PM

ఎన్.ఐ.టి (నిట్) విద్యార్థుల సమస్యలు కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ పరిశీలిస్తుందని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు తెలిపారు.

న్యూఢిల్లీ : ఎన్.ఐ.టి (నిట్) విద్యార్థుల సమస్యలు కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ పరిశీలిస్తుందని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు తెలిపారు. బుధవారం న్యూఢిల్లీలో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడుతో జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ భేటీ అయ్యారు. ఈ భేటీ అనంతరం వెంకయ్యనాయుడు,ముఫ్తీ విలేకర్లతో మాట్లాడుతూ... ఇరువురి మధ్య శ్రీనగర్ ఎన్ఐటీ అంశం చర్చకు వచ్చినట్లు ఆయన తెలిపారు.

హెచ్సీయూ, జేఎన్యూ ఆ తర్వాత ఎన్ఐటీలో చోటు చేసుకున్న ఘటనలు... పరిణామాలతోపాటు ఆయా సమస్యల పరిష్కారంపై ఈ సందర్భంగా చర్చకు వచ్చినట్లు చెప్పారు. జమ్మూ కాశ్మీర్ నేపథ్యం  ప్రతిఒక్కరు గుర్తించుకోవాలన్నారు. అయితే ఈ సమస్యలను రాజకీయం చేయాలని ప్రతిపక్షాలు ఆలోచిస్తున్నాయని వెల్లడించారు. రాజకీయాలు చేయవద్దని ఈ సందర్భంగా ప్రతిపక్షాలకు వెంకయ్య హితవు పలికారు.

మెహబూబా ముఫ్తీ మాట్లాడుతూ.. స్థానికేతర విద్యార్థులందరికీ భద్రత కల్పిస్తామని ఆమె స్పష్టం చేశారు. వెంటనే తిరిగి రావాలని క్యాంపస్ నుంచి వెళ్లిన విద్యార్థులకు ఆమె సూచించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement