యోగి ఆదిత్యనాథ్‌ అనుచిత ఆగ్రహం

UP Cm Loses His Temper In Kushinagar Accident Protest - Sakshi

సాక్షి, లక్నో : ఉత్తరప్రదేశ్‌లోని కుషీనగర్‌ జిల్లాలో గురువారం నాడు కాపలాలేని రైల్వే క్రాసింగ్‌ వద్ద ఓ రైలు, ఓ స్కూల్‌ వ్యాన్‌ ఢీకొన్న సంఘటనలో 13 మంది విద్యార్థులు మరణించిన విషయం తెల్సిందే. ఈ దుర్ఘటనకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న పిల్లల తల్లిదండ్రులు, స్థానిక ప్రజలపై రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘నినాదాలు ఆపండి, ఇది విషాధకర సంఘటన. మీ నాటకాలు కట్టి పెట్టండి. నా మాటలు ఆలకించి మీ నాటకాలు ఆపండి!’ అంటూ ఆదిథ్యనాథ్‌ ఆవేశంగా మాట్లాడారు. 

జరిగిన దుర్ఘటన పట్ల సానుభూతి వ్యక్తం చేయడమే కాకుండా వారి తల్లిదండ్రులకు ఆర్థిక సహాయం, చేయూత అందించాల్సిన ముఖ్యమంత్రి ఇలా ‘మీ నాటకాలు ఆపండి’ అంటూ మాట్లాడం పట్ట బాధితుల తల్లిదండ్రులే కాకుండా ప్రజలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మతులంతా డివైన్‌ స్కూల్‌కు చెందిన పిల్లలే. అందరూ పదేళ్లలోపు వారే. యోగికి సంబంధించిన ఈ వివాదాస్పద వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top