చైనా పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు శుక్రవారం సాయంత్రం షాంఘై చేరుకున్నారు.
బీజింగ్: చైనా పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు శుక్రవారం సాయంత్రం షాంఘై చేరుకున్నారు. అక్కడ అంజు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డైరెక్టర్ యోఘేష్వాగ్తో సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. తెలంగాణలో మౌలిక సదుపాయాల ప్రాజెక్టులపై యోఘేష్వాగ్తో కేసీఆర్ చర్చించారు. అనంతరం బీజింగ్లో ఉన్న భారత రాయబారి నివాసానికి వెళ్లారు. తర్వాత బీజింగ్ ప్రముఖులతో కలిసి విందు భేటీలో సీఎం కేసీఆర్ బృందం పాల్గొన్నది.


