టెక్నాలజీతో ఓటింగ్‌ పెంచుతాం

Chief Electoral Officer Ranbir Singh Speaks About Delhi Assembly Elections - Sakshi

ఢిల్లీ ఎన్నికల అధికారి రణ్‌బీర్‌

న్యూఢిల్లీ: టెక్నాలజీని సమర్థవంతంగా ఉపయోగించుకొని ఓట్ల శాతాన్ని పెంచుతామని, పలు కార్యక్రమాల ద్వారా ఓటర్లను ఓటేసేలా చేస్తామని ఢిల్లీ చీఫ్‌ ఎలక్టోరల్‌ ఆఫీసర్‌ (సీఈఓ) రణ్‌బీర్‌ సింగ్‌ మంగళవారం చెప్పారు. త్వరలోనే భారీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు. మొబైల్‌ అప్లికేషన్లు, క్యూఆర్‌ కోడ్‌లు, సోషల్‌ మీడియాల ద్వారా ఓటర్లను ఆకర్షిస్తామని చెప్పారు. ‘జోష్‌ టాక్స్‌’ ప్రతినిధుల ద్వారా కాలేజీలు, ఇతర సంస్థల్లో కార్యక్రమాలు చేపడతామన్నారు. ప్రముఖ రేడియో జాకీ నవీద్‌ ఖాన్, కథక్‌ డాన్సర్‌ అలక్‌నంద దాస్‌గుప్త, క్రీడాకారులు మానిక బాత్రా, రిషభ్‌ పంత్‌ పాల్గొననున్నట్లు చెప్పారు.  మొత్తం 1.4 కోట్ల మంది ఓటర్లని తెలిపారు.

అభ్యర్థులను ప్రకటించిన ఆప్‌.. 
ఫిబ్రవరి 8వ తేదీన ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆప్‌ అన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. సీఎం కేజ్రీవాల్‌ ఢిల్లీ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయనున్నారు. డిప్యూటీ సీఎం మనీశ్‌ సిసోడియా పత్పార్‌గంజ్‌ నుంచి బరిలో దిగనున్నారు. ఇప్పటికే ఐదుగురు నామినేషన్‌ దాఖలు చేశారు. 15 స్థానాల్లో సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు మారారు. 24 మంది కొత్త వారు కాగా మొత్తం 8 మంది మహిళలు కూడా బరిలో ఉన్నట్లు తెలిపారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top