పేలుళ్ల అనుమానితుడి వీడియో విడుదల

పేలుళ్ల అనుమానితుడి వీడియో విడుదల


* రైలు దిగి పరిగెత్తిన అనుమానితుడు

* తమిళనాడు సీబీసీఐడీ వెల్లడి

* బాంబులను బెంగళూరులో అమర్చి ఉండొచ్చని అనుమానం

 


 చెన్నై: చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్‌లో గురువారం బెంగళూరు- గువాహటి రైల్లో జరిగిన రెండు బాంబుల పేలుళ్లకు సంబంధించి కీలక అనుమానితుడి వీడియో ఫుటేజీని శుక్రవారమ్కిడ విడుదల చేశారు. అతని కదలికలు అనుమానాస్పదంగా ఉండడంతో దర్యాప్తులో తొలి ఆధారం దొరికినట్లు భావిస్తున్నారు. తమిళనాడు సీబీసీఐడీ ఐజీపీ మహేశ్‌కుమార్ అగర్వాల్ విలేకర్ల సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ పుటేజీని విడుదల చేశారు. ‘కొన్ని వీడియో దృశ్యాల్లో కనిపించిన వ్యక్తి కదలికలు అసాధారణంగా ఉన్నాయి. వీటిని తనిఖీ చేయాలి’ అని అన్నారు. వీడియో ఫుటేజీలో.. బట్టతలలో ఉన్న మధ్యవయస్కుడు స్పష్టంగా కనిపిస్తున్నాడు. రైలు తొమ్మిదో నంబర్ ఫ్లాట్‌ఫారమ్ చేరుకున్నాక అతడు.. పేలుళ్లు జరిగిన ఎస్4, ఎస్5 బోగీల పక్కనున్న ఎస్3 బోగీ నుంచి హడావుడిగా రైలు దిగి పరిగెత్తాడు.

 

 అతడు చెన్నైలో రైలు ఎక్కలేదని ఐజీపీ స్పష్టం చేశారు. ఈ అనుమానితుడి సమాచారాన్ని సీబీసీఐడీ కంట్రోల్ రూమ్ నంబర్లు 044-22502510/ 22502500, 77086 54202లకు తెలియజేయాలని ప్రజ లకు విజ్ఞప్తి చేశారు. పేలుళ్లకు వాడిన బాంబులను చెన్నైలో అమర్చలేదని, వాటిని చెన్నైకి ముందు స్టేషన్లలో పెట్టి ఉండొచ్చని ఐజీపీ తెలిపారు. ముష్కరుల లక్ష్యం కూడా చెన్నై కాదని తెలుస్తోందన్నారు. రైలు ఆలస్యం కాకుండా షెడ్యూలు ప్రకారం నడిచి ఉంటే ఉదయం ఏడింటికి అది ఆంధ్రప్రదేశ్‌లో ఉండేదన్నారు. పేలిన బాంబులకు కొన్ని నెలల కిందటి పాట్నా పేలుళ్లకు వాడిన బాంబులతో పోలికలు ఉన్నాయన్నారు. బాంబుల లక్ష్యం గురువారం ఆంధప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారం చేసిన బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీనా అని అడగ్గా, టార్గెట్‌పై  నిర్దిష్ట సమాచారమేదీ లేదన్నారు. పేలుళ్ల స్థలం నుంచి స్వాధీనం చేసుకున్న పదార్థాలను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపామన్నారు.

 

 బెంగళూరులో తమిళనాడు సీబీఐసీఐడీ

 సాక్షి, చెన్నై/బెంగళూరు: గువాహటి ఎక్స్‌ప్రెస్‌లో పేలిన రెండు బాంబులను బెంగళూరులో అమర్చి ఉంటారని తమిళనాడు సీబీసీఐడీ అనుమానిస్తోంది. తక్కువ తీవ్రత గల టైమర్ బాంబులను రైలు బెంగళూరులో బయల్దేరడానికి ముందు అమర్చి ఉండొచ్చని తమిళనాడు సీబీసీఐడీ అధికారి ఒకరు చెప్పారు. దుండగులకు కర్ణాటకలోని నిద్రాణ ఉగ్ర వాద ముఠాలు సహకరించి ఉండొచ్చని సమాచారం అందడంతో తమిళనాడు సీబీసీఐడీకి చెందిన ప్రత్యేక దర్యాప్తు బృందం శుక్రవారం బెంగళూరు చేరుకుంది. సిటీ రైల్వే స్టేషన్‌లో గురువారం నాటి సీసీటీవీ వీడియోలను పరిశీలించింది. పేలుళ్లు జరిగిన ఎస్-4, ఎస్-5ల బోగీల్లో ప్రయాణించిన 74 మంది పేర్లు, సెల్‌ఫోన్ నంబర్లు, ఇతర వివరాలు సేకరించింది. ఈ పేలుళ్లలో గుంటూరుకు చెందిన స్వాతి అనే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ చనిపోగా, 14 మంది గాయపడడం తెలిసిందే. ఎన్‌ఎస్‌జీ బృందం చెన్నైకి చేరుకుని పేలుళ్ల స్థలాన్ని, పేలుళ్లు జరిగిన రెండు బోగీలను పరిశీలించింది. గురు, శుక్రవారాల్లో చెన్నైలో ఓ షాపింగ్ మాల్, విద్యాసంస్థ, సబర్బన్ రైల్వే స్టేషన్‌కు వచ్చిన బాంబు బెదిరింపు కాల్స్ పోలీసులు ఉరుకులు పరుగులు పెట్టించాయి. విస్తృతంగా తనిఖీ చేసిన పోలీసులు ఫోన్స్ కాల్స్ నకిలీవని తేలడంతో ఊపిరి పీల్చుకున్నారు.

 

 చెన్నైలో మరిన్ని పేలుళ్లకు కుట్ర: రైల్లో పేలుళ్ల నేపథ్యంలో తమిళనాడు పోలీసులు రాష్ట్రంలో జరిపిన తనిఖీల్లో 15 మంది ఉగ్రవాదులు పట్టుబడ్డారు. వీరు చెన్నైల్లో మరిన్ని పేలుళ్లకు కుట్ర పన్నారని అనుమానిస్తున్నారు. గత నెల 29న అరె స్టు చేసిన శ్రీలంకకు చెందిన ఐఎస్‌ఐ ఏజెంట్ జాకీర్ హుస్సేన్ పోలీసుల విచారణలో.. చెన్నైలో పేలుళ్లకు ఉగ్రవాదులు కుట్రపన్నినట్లు తెలిసింది. దీంతో పోలీసులు నగరాన్ని జల్లెడ పట్టారు. శ్రీలంకకు చెందిన శివబాలన్(39)ను టీ నగర్‌లో, మహమ్మద్ సలీం(37)ను రాయపురంలో గురువారం రాత్రి అదుపులోకి తీసుకుని, రూ. 2.50 లక్షల నకిలీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాది అషఫ్ ్రఆలీని, అతని అనుచరులుగా భావిస్తున్న 12 మందిని కడలూరు జిల్లా పరంగిపేట్టైలోని ఓ ఇంట్లో అరెస్ట్ చేశారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top